కమిషన్ ముందు హాజరైన ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు
రుణాలు, ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్ కేటాయింపుపై ప్రశ్నలు
సుదీర్ఘంగా విచారించిన జస్టిస్ ఘోష్ కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆయన్ను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి మంగళవారం నుంచి కమిషన్ విచారణను ప్రారంభించింది. దాదాపు గంటన్నర పాటు రామకృష్ణారావును కమిషన్ విచారించింది. దాదాపు 24 ప్రశ్నలను రామకృష్ణను కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగారు. రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ఆయనను ముందు ప్రశ్నలు ఉంచారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, లోన్స్, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులపై వంటి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్టు డిజైన్లు, బ్జడెట్ కేటాయింపులపై కమిషన్ ప్రశ్నించింది.
కార్పొరేషన్‌కు నిధులు ఎలా సమకూర్చారు? కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారు? డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా? అని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు చెప్పారు. ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ, నిబంధనలు పాటించలేదని ఈ సందర్భంగా కమిషన్ వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించగా.. పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీలు పెట్టలేదని ఈ సందర్భంగా కమిషన్ రికార్డులు చూపించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదు, ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులు నిర్వహించలేదని పేర్కొంది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారెంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని, 9 నుంచి 10.5 శాతం వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు.
కార్పొరేషన్‌కు నిధులు ఎలా వచ్చాయని కమిషన్ ప్రశ్నించింది. బడ్జెట్ కేటాయింపులు, లోన్స్ ద్వారా నిధులు సమకూర్చినట్లు రామకృష్ణారావు సమాధానం ఇచ్చారు. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న కమిషన్ ప్రశ్నకు.. పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నీళ్లు అమ్మి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్ట్ లక్ష్యమని రామకృష్ణ చెప్పినట్లు సమాచారం. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని రామకృష్ణను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ ప్రశ్నించగా.. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీతో ఎప్పుడూ సమావేశం కాలేదని, కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామకృష్ణారావు చెప్పారు. ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కమిషన్ అడిగింది. అలాగే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పాలసీస్ పెట్టారా అని కమిషన్ ప్రశ్నించగా..
దానికి రామకృష్ణారావు తెలియదని సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్‌గా కేబినెట్ ముందుకు రాలేదని.. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ అడిగింది. నిబంధనలు పాటించకుండా విడుదల చేసిన నిధుల రికార్డులను రామకృష్ణారావుకు కమిషన్ చూపించింది. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను సరిగా మెయింటెయిన్ చేయలేదని కమిషన్ ప్రశ్నించగా.. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే కార్పొరేషన్ లోన్స్ తీసుకుందని రామకృష్ణ తెలిపారు. 2024- 25 ఫైనాన్షియల్ ఇయర్లో రూ.7382 ప్రిన్సిపల్ అమౌంట్‌కు రూ.6519 కోట్ల వడ్డీ చెల్లించామని ఆయన వెల్లడించారు. 9 నుంచి 10.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని కమిషన్‌కు రామకృష్ణారావు తెలిపారు. కాగా.. గతంలోనే ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు, ఇంజనీర్లతో అఫిడవిట్లను తీసుకుంది కమిషన్. ఆ అఫిడవిట్లను ముందు పెట్టుకునే కమిషన్ బహిరంగ విచారణ చేస్తోంది. గత జూలైలోనే విచారణకు రావాల్సిందిగా రామకృష్ణారావుకు కమిషన్ నోటీసులు ఇచ్చింది.





