నిశ్శబ్దత నుంచి భద్రత వైపు..

మోదీ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు కొత్త నిర్వచనమిచ్చిన న్యాయ సంస్కరణలు 2012లో జరిగిన దారుణమైన నిర్భయ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన, పరిపాలనా వ్యవస్థలోని లోపాలను కూడా బహిర్గతం చేసింది. సరైన పోలీసు యంత్రాంగం లేకపోవడం, న్యాయ వ్యవస్థ స్పందనలో ఆలస్యం, కాలం చెల్లిన చట్టాలు, బాధితులకు సహకరించే…
