విద్యావ్యవస్థలో పెను మార్పులు రావాలి!
నేటి పాఠ్యాంశాల్లో క్రమశిక్షణకు, నైతిక విలువలకు చోటివ్వాలి అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వొచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు…