దాక్షిణాత్య ఉద్యమం

రావలసి ఉన్నది. రావడానికి కావలసిన భౌతిక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వస్తే బాగుంటుంది. కానీ, వచ్చితీరుతుందని చెప్పలేము. ద్రావిడ సాహిత్యోద్యమం అనగానే, గతంలో ఉమ్మడి మద్రాసురాష్ట్రంలో తమిళుల నాయకత్వంలో జరిగిన ద్రావిడ రాజకీయ, సామాజిక ఉద్యమం మనకు స్ఫురిస్తుంది. తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలలో దాని ప్రభావం పరిమితంగానే ఉండింది. దక్షిణాది ప్రాంతాల వారి మధ్య సోదరత్వ సారూప్యాలు ఉండవచ్చును…
