నైపుణ్యాల పేరిట ఉన్నత సాంకేతిక విద్యకు ఉరి!

రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిర్వహించిన భారీ ధర్నా, తదనంతర అరెస్టులు రాష్ట్రంలో నెలకొన్న విద్యా సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. కేవలం పటాన్‌చెరులోనే కాకుండా కొత్తగూడెం, రామంతపూర్, వికారాబాద్, నల్గొండ వంటి పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం…

