Tag responsible

లగచర్ల ఘటనకు సిఎం రేవంత్‌దే బాధ్యత

image.png వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అని నరేందర్‌ ‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఫార్మా కంపెనీ ఏర్పాటు చెయ్యొద్దని రైతులు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అరెస్ట్ ‌చేశారని చెప్పారు. పేద రైతులు ప్రాణం పోయినా భూములు ఇవ్వమని చెబుతున్నారని, ముఖ్యమంత్రి మొండిగా ప్రవర్తిస్తూ సోదరుల కోసం, సొంత బామ్మర్ది కోసం, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కోసం అమాయక రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. భూ సేకరణ ఆపాలని, అమాయక రైతులను అరెస్టు చెయ్యొద్దని కోరారు. రాజకీయం చేయడానికి ఇప్పుడు ఎన్నికలు లేవని, అక్కడ అన్ని రాజకీయ పార్టీల రైతులకు భూములు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో తన అనుచరుడు సురేష్‌ ‌హస్తం ఉందని వచ్చిన ఆరోపణలపై కూడా పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. సురేష్‌ ‌తమ కార్యకర్త కాబట్టి మాట్లడాడని, ఆయనకు అక్కడ భూమి ఉందని, అందుకే ఆయన కూడా ప్రశ్నించాడని చెప్పారు. ఫార్మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలు పెడితే స్వాగతిస్తామని, పేద రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడుతామని పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

అనుచరుడు సురేష్‌కు భూమి ఉంది కనుకనే పోరాడుతున్నాడు కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌  ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం…

You cannot copy content of this page