అంతిమయుద్ధం: విమర్శ, విద్రోహం, విషాదం

“రకరకాల స్వార్థం మీద, ప్రజల వనరులను, శ్రమలను అపహరించే వ్యవస్థీకృత దౌర్జన్యం మీద కత్తిదూసిన ఆశాదూతలు ఇప్పుడు ఒక నిర్మూలన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. వారు నిర్మించుకున్న ఆత్మరక్షణ దుర్గాలు, నిర్మించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలు అన్నీ, మోహరించిన రాజ్య శక్తి ధాటికి కుప్పకూలిపోతున్నాయి. సాహసత్యాగాల సాయుధత్వం కూడా నిస్పృహలోకి జారి, లొంగిపోతున్నది. నౌకతో పాటు మునిగిపోయే నిబద్ధ కేసెబియాంకలు…
