క్రీడలను కలుషితం చేస్తున్న రాజకీయాలు

ఒక ఆటగాడి నైపుణ్యం గెలుపు ఓటముల్లోనో లేక రాజకీయ ప్రభావిత వేదికలు లేదా తరుముతున్న జాతీయవాదంలోనో వెల్లడి కాదు. కేవలం ఆటలో అతను చూపిన నైపుణ్యంపైనే అతని ప్రతిభను క్రీడాభిమానులు, విశ్లేషకులు గుర్తిస్తారు. మనం ఒక టీవీ సీరియల్‌ను వీక్షిస్తున్నప్పుడు, అది ఎంతటి అద్భుతమైన కథనమైనా, పాత్రలు ఎంతో గంభీరంగా వున్నప్పటికీ, కథ రచనాశైలి, నడిపిన…
