కాగల కార్య గంధర్వ బబ్లూ!

“ఇంకో మాట చెప్పు” అంది అనసూయ. మాలతి మాట్లాడలేదు. “అంతేలే, యెవరైనా ఆరుమాసాలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, అలాంటిది ఆరేళ్ళు సంసారం చేస్తే?” నవ్వింది అనసూయ. మాలతి నవ్వలేదు. “కానీ, భార్యాభర్తల్లో యెక్కువ మంది భర్తల్నే అనుసరిస్తారు భార్యలు” చివరి పదం వొత్తి పలుకుతూ అంది అనసూయ, ఆమాటలో ‘నువ్వు కూడా అంతే, అందర్లానే’…
