మానసిక ఆరోగ్యానికి కొత్త దిశ

“దీపికా పదుకొనే తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న డిప్రెషన్ అనుభవాలను ప్రజలతో పంచుకోవడం భారతదేశంలో ఒక పెద్ద మార్పును తెచ్చారు. 2015లో ఆమె స్థాపించిన “ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్” లక్షలాది మందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించింది..” దీపికా పదుకొనే రాయబారిగా నియామకం భారతదేశానికి స్ఫూర్తి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం చేసిన ఒక చారిత్రాత్మక నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ప్రముఖ సినీ నటి దీపికా పదుకొనేను భారతదేశపు తొలి *“మెంటల్ హెల్త్ అంబాసిడర్” గా నియమించడం ద్వారా మానసిక ఆరోగ్యం జాతీయ ప్రాధాన్యంగా నిలిచింది. ఇది కేవలం ఒక సెలబ్రిటీ నియామకం కాదు ఇది భారతదేశం మానసిక ఆరోగ్య విప్లవం వైపు వేస్తున్న గొప్ప అడుగు.: మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంతో సమానమైనదే. డీపికా పదుకొనే వంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని రాయబారిగా నియమించడం ప్రజల్లో అవగాహనను పెంచి, ‘మానసిక సమస్యలు సిగ్గు కాదు సహాయం తీసుకోవడం అవసరం’ అనే బలమైన సందేశాన్ని ఇస్తుంది. మానసిక ఆరోగ్యంపై మచ్చ తొలగించే కదలిక: దీపికా పదుకొనే తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న డిప్రెషన్ అనుభవాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా భారతదేశంలో ఒక పెద్ద మార్పును తెచ్చారు. 2015లో ఆమె స్థాపించిన “ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్” లక్షలాది మందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించింది. పది సంవత్సరాల క్రితం, నా లక్ష్యం ప్రజలు ‘నేను ఏం అనుభవిస్తున్నానో దానికి పేరు ఉంది’ అని గుర్తించడమే. ఇప్పుడు, ప్రజలు సహాయం కోరడాన్ని సహజంగా భావించే సమాజం కోసం కృషి చేస్తున్నాను.” ఈ భావన ఒక వ్యక్తి నుండి సమాజ స్థాయికి మారడం – అదే ఈ నియామకానికి ఉన్న గొప్పతనం. ప్రభుత్వం మరియు ప్రజల భాగస్వామ్యం అవసరం: భారతదేశం మానసిక ఆరోగ్య పరంగా ముందుకు సాగాలంటే ప్రభుత్వం, నిపుణులు, విద్యాసంస్థలు, మరియు ప్రజల మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. పాఠశాలలు, కళాశాలల్లో సైకాలజిస్టులను నియమించడం, ప్రతి జిల్లా హాస్పిటల్ లో కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం అత్యవసరం.” “టెలీ మానస్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను బలపరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా మానసిక ఆరోగ్య సేవలు అందించవచ్చు.” యోగా, ధ్యానం, సైకాలజీ సమగ్ర భారత దిశగా : భవిష్యత్తులో భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణను శాస్త్రం మరియు భారతీయ సాంప్రదాయ విలువలతో కలపాలి. భారతదేశానికి ఉన్న యోగా, ధ్యానం వంటి మానసిక సమతుల్యత సాధన పద్ధతులు ఆధునిక సైకాలజీతో మిళితమైతే, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి. ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ దృష్టికోణం కలిసినప్పుడు మాత్రమే మన దేశం నిజమైన ‘హోలిస్టిక్ హెల్త్ ఇండియా’గా ఎదుగుతుంది.” భవిష్యత్తు మార్గం – మూడు ప్రధాన దిశలు: మానసిక ఆరోగ్య అవగాహనలో మూడు ముఖ్యమైన దిశలు అవసరం: అవగాహన (Awareness): మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చలకు వేదికలు కల్పించాలి. సముపాయం (Accessibility): ప్రతి పౌరుడికి సులభంగా కౌన్సెలింగ్ సేవలు అందించాలి. ఆత్మబలం (Acceptance): సహాయం తీసుకోవడం బలహీనత కాదు, అది ధైర్యం అని సమాజం అంగీకరించాలి. భారతదేశంలో మానసిక ఆరోగ్య పరిస్థితులు: దేశంలో ప్రతి 8 మందిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. WHO అంచనా ప్రకారం, భారతదేశంలో డిప్రెషన్, ఆందోళన, మరియు ఆత్మహత్యా ఆలోచనల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మానసిక ఆరోగ్య బడ్జెట్ మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో 2% కన్నా తక్కువ. టెలీ మానస్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 10 లక్షలకు పైగా కాల్స్ నమోదయ్యాయి. మానసిక ఆరోగ్యానికి కొత్త దిశ: దీపికా పదుకొనే నియామకం ఒక సంకేతం మాత్రమే కాదు – ఒక మార్పు ప్రారంభం. ఇది మనకు ఒక సందేశం ఇస్తుంది. మనసు ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సమతుల్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని జాతీయ అభివృద్ధి భాగంగా చేర్చిన ఈ నిర్ణయం ప్రతి భారత పౌరుడికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
