మెరుపు తీగెలు దోషి!

“అమ్మా…” గొంతు నరాలు చిట్లిపోయేలా అరిచాడు ‘దోషి’. “ఒరేయ్… ఆ నోట్లో లాఠీదించి దెం…” యస్సై చెప్పిన మాటని అర్థం చేసుకున్న కానిస్టేబులు దోషి నోట్లో గుడ్డని కుక్కాడు. ఆర్తనాదం అణిగిపోయింది. బోర్లా పడుకోబెట్టిన దోషి వీపుమీద వొక కానిస్టేబులు తొక్కి కూచుంటే, మరో యిద్దరు కానిస్టేబుళ్ళు అరికాళ్ళమీద లాఠీలతో బాదుతూనే వున్నారు. చాలక యస్సై…
