Tag governance issues

లిక్క‌ర్ స్కామ్…కంచికి చేరని  క‌థ‌!

“ఈ స్క్రిప్ట్ ల‌ను సీబీఐ, ఈడీల కేంద్ర కార్యాల యాలున్న రాజ‌ధానీ న‌గ‌రాన్ని ఆనుకొని ప్ర‌వ‌హిస్తున్న య‌మునాన‌ది మురికి నీటిలో క‌రిగిపోయే వ‌ర‌కు ముంచి ఉంచడం  త‌ప్ప మ‌రోమార్గం లేదు. ఒకానొక రోజున ఈ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఫ‌లానా ముఖ్య‌నాయ‌కుడికి వ్య‌తిరేకంగా గొంతు చించుకుంటాయి. త‌ర్వాత ఈ కేసు మొత్తం విష‌పూరితంగా మారిపోయి చివ‌ర‌కు అదృశ్య‌మైపోతుంది.…

మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో…

అంతరాంతరము!

మెరుపు తీగెలు మూడుగంటల ముందు పుట్టిన తమ్ముడ్ని చూడాలని మారాము కాదు, యేకంగా యేడుస్తూ వున్నాడు యేడేళ్ళ వాడి అన్న. వద్దన్నా వినడం లేదు. అమ్మ కడుపులో వున్నప్పుడు చాలా సార్లు ముద్దుపెట్టుకున్నాడు కూడా. తమ్ముడా చెల్లా అని తలుపు బయట రాత్రంతా నిద్రపోకుండా కాచుక్కూర్చున్నాడు. లోపలినుంచి వచ్చిన వాళ్ళని అడిగాడు. ఎవరూ యేమీ చెప్పలేదు.…

సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో  గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన…

సత్యాన్ని సమాధి చేసే కుట్రలు

Conspiracies That Bury the Truth

“కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా …

చరిత్ర: వర్తమాన వైఫల్యాలకు రక్షణకవచమా ..?

“చరిత్ర మన వర్తమాన, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలి, అంతేకానీ చీకటిలో మనం తడబడిన ప్రతిసారీ నిందించే దెయ్యంలా ఉండకూడదు. స్వతంత్ర భారతదేశ  పోరాట యోధులు ఇప్పటికే వారి చరిత్రను రాసేశారు, అది మంచిదైనా చెడ్డదైనా వారి కలం సిరా ఎప్పుడో ఇంకిపోయింది. నేటి నాయకత్వం ఆ పాత పేజీలను చెరిపేయడం పైనే ఎందుకు అంతగా…

లడఖ్ భవిష్యత్తును దిల్లీ నుంచి నిర్ణయించలేరా ?

“లడఖ్ అనుభవం ఒంటరిది కాదు. కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం వంటి భారత సరిహద్దు ప్రాంతా లన్నింటినీ ఇదే నమూనా కనిపిస్తుంది. జాతీయ ఏకత్వం పేరుతో ప్రత్యేక రక్షణలు తొలగించబడుతున్నాయి. స్థానిక నాయకత్వాన్ని అప్రామాణికం చేస్తున్నారు. నిరసనలను అస్థిరత గా, తీవ్రవాదంగా చిత్రీకరిస్తున్నారు. సైనికీకరణ ద్వారా గనులు, పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తున్నారు.”  2019లో…

బీసీ ద్రోహులెవరు..?..బాధితులెవ్వరు..?

“హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేస్తున్న కొంతమంది బీసీ…

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…