Tag Elections Promises to Youth

కొలువుల తెలంగాణా’ కావాలి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే.తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా,ప్రాణాలని పణంగా పెడితే ఆ త్యాగల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకున్నది.తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి,అది వారి హక్కు కూడా.కానీ ఈ పదేండ్లలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశ,అసంతృప్తి,అందోనళ నను ప్రభుత్వం అర్ధం చేసుకొవాలి.ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీనీ అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి, ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాలని నిరుద్యోగులు ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో మళ్ళీ చిగురించిన ఆశలు? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీ రోల్ అని ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం,ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని, మా ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల భాధలు,సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నదని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్ గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకి కల్పించారు.కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 2లక్షల ఉద్యోగాలు,జాబ్ క్యాలెండరు అనేది ఒక సంచలనం.పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలని శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బoదిగ జాబ్ క్యాలెండరు అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి.టీజీపిఎస్సీ చైర్మన్ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త ఛైర్మన్ ని నియమించడం మంచి పరిణామం.కోచింగ్ సెంటర్ల దోపిడీ నుండి గ్రామీణ పేద విద్యార్థలకీ విముక్తి కల్పించి, తల్లిదండ్రులకి లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది.ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లని ఏర్పాటు చేసి అనుభవజ్ఞ్యులైన అధ్యాపకుల చేత ఖరీదైనా కోచింగ్ ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగులకి ఇచ్చిన ప్రతి హామీని నిరవేర్చాలి? నిరుద్యోగుల బాధలను స్వయంగా చూడటానికి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధి అశోక్ నగర్ వొచ్చి, నిరుద్యోగుల బాధలను కళ్లారా చూసి చలించిపోయి మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుందని ఇది నా గ్యారెంటీ అని హామీ ఇవ్వడంతో, నిరుద్యోగులు ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో మళ్ళీ పుస్తకాలని పట్టుకున్నారు.తమ జీవితం ఆగమైపోయిందని అనుకున్న నిరుద్యోగులలో జాబ్ క్యాలెండరు,2లక్షల ఉద్యోగాల హామీ ఆనందాన్ని ఇచ్చింది.యేండ్లకేండ్లు ఉద్యోగాల భర్తీ జరగకుండా, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్ట్ మెట్లు ఎక్కకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, స్పష్టంగా జాబ్ క్యాలెండరులో పెట్టిన తేదీల ప్రకారం వేగంగా ఉద్యోగాలని భర్తీ చేయాలి.అదేవిధంగా నిరుద్యోగులకి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగభృతి 4000 రూపాయలని వెంటనే ప్రభుత్వం అందివ్వాలి. ప్రభుత్వం తండ్రిలా నిరుద్యోగబిడ్డలకి గౌరవప్రదమైన జీవితం దక్కేలా భరోసా కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడిబెట్టడం న్యాయమేనా? నిరుద్యోగులంటే అంత చిన్నచూపా, అవమానకారంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసిపడేయడం ఇది ఏ విధంగా ప్రజా ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది. మేం ఎన్నో కలలు కన్నాం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొస్తే 2లక్షల ఉద్యోగాలని,జాబ్ క్యాలెండరు ద్వారా భర్తీ చేస్తుందని అనుకున్నాం.ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు 10యేండ్లు అధికారంలో లేరు తప్పకుండ వారికి మా బాధలు తెలుసు కాబట్టి ఉద్యోగాల భర్తీనే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలనీ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్ధిస్తున్నారు.అంతేకాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడివేయడం నిజంగా బాధాకరం.ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే,అయినా అప్పటి ప్రభుత్వం మీద ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా,కొట్లాడారు కదా?అప్పుడు మీరు అప్పులుతో ఉద్యోగాలని ఏందుకు ముదిపెట్టలేదు?మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలనీ నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి ఎప్పటికప్పుడు ఖాలీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి.ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రయివేట్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలని, ప్రోత్సహాకాలని అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి, ప్రయివేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకి దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి.పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకి అవసరమయినా సాంకేతిక నైపుణ్యలని ప్రభుత్వమే అందివ్వాలి.పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్య వ్యవస్థని మార్చాలి.అదేవిధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణాలు ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది. -:శ్రవణ్ కుమార్ నల్ల నిరుద్యోగి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని…

You cannot copy content of this page