యువతకు చీడగా మారిన డ్రగ్స్ దందా!!

ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) మరణం తెలంగాణలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలియజెబుతోంది. జనవరి 23న ఆమెపై దాడి జరగ్గా, హాస్పిటల్‌లో మరణంతో పోరాడి జనవరి 31న తుదిశ్వాస విడవడం విషాదం. జనవరి 23 రాత్రి గంజాయి అక్రమ రవాణాపై సమాచారమందుకున్న నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ బృందం మాధవనగర్ ప్రాంతంలో వాహనాల…
