అనుభవాల స్టాచ్యూ

విషాదఛాయలు పులుముకున్నప్పుడు నడుస్తూ ఉంటా ఒక పొడవాటి బాటలో పక్కన చెట్లలా ధైర్యవంతులు కొందరు కనిపిస్తరు కొండలు గుట్టలు నన్ను ఒక్కడినే విసిరేసినట్టు సృష్టి పగబట్టి కంపిస్తున్నట్లు పండ్లు పటపటమని కొరుకుతూ వానలో తడిసాక తేలిక పడుతుంది ఆలోచన చలిలో పొదిగి గంభీరతను పొంది ఎండను మరిచి వెనుదిరిగి మళ్ళీ మొదలెడుతుంది నౌకను గీస్తది కొత్త…