Category సన్నివేశం

వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా!

“పదేళ్లుగా దేశంలో నెలకొన్న  విభజన వాతావరణంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక అసహనం, తమ ప్రాధాన్యాలను అమలుచేయించడానికి పౌర నిఘా (విజిలాంటిజమ్) పెరిగిపోయాయి. మూక దాడులు, హింసాకాండ పెరిగిపోయాయి. గోమాంసం తింటున్నారని, గోవులను అక్రమరవాణా చేస్తున్నారని అనుమానంతో హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే, ఉత్తరభారతంలో పరిస్థితులు ఉన్నాయి..” “వయసుడిగిన నాడు నన్ను…

అంతిమయుద్ధం:  విమర్శ, విద్రోహం, విషాదం

“రకరకాల స్వార్థం మీద, ప్రజల వనరులను, శ్రమలను అపహరించే వ్యవస్థీకృత దౌర్జన్యం మీద కత్తిదూసిన ఆశాదూతలు ఇప్పుడు ఒక నిర్మూలన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. వారు నిర్మించుకున్న ఆత్మరక్షణ దుర్గాలు, నిర్మించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలు అన్నీ,  మోహరించిన రాజ్య శక్తి ధాటికి కుప్పకూలిపోతున్నాయి. సాహసత్యాగాల సాయుధత్వం కూడా నిస్పృహలోకి జారి, లొంగిపోతున్నది. నౌకతో పాటు మునిగిపోయే నిబద్ధ కేసెబియాంకలు…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…

యుద్ధప్రభువులూ వారే, శాంతి దూతలూ వారే!

“పోగాలం వచ్చినప్పుడు, అన్నీ గతులు తప్పుతాయట. మనుషులు కూడా తలకిందుల నీతితో వ్యవహరిస్తారట. న్యాయం అనేది రద్దు అవుతుందట. అటువంటి ప్రళయదశ వచ్చిందని అమెరికా అధ్యక్షుడు అంగీకరిస్తాడని అనుకోలేము. కానీ, ప్రపంచం నిలబడిన పద్ధతుల ఇరుసును తలకిందులు చేయడానికి అతను నడుం కట్టాడు. దానికి చాలా తెగింపు కావాలి. పరిహాసాస్పదంగా వ్యవహరించే ధైర్యం కావాలి. అటువంటి…

సృజనాత్మక పోరాటాల ప్రజలు, పాత పనిముట్ల ప్రభుత్వాలు

“2019లో ఆర్టికల్‌ 370ను నిర్వీర్యం చేసి, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను లెజిస్లేచర్‌తో కూడిన కేంద్రపాలితప్రాంతంగాను, లద్దాఖ్‌ను లెజిస్లేచర్‌ లేని కేంద్రపాలితప్రాంతంగాను చేశారు. తమ ప్రాతినిధ్యం మరింతగా దిగజారిందని, ఒక్క పార్లమెంటు సభ్యత్వంతో జాతీయస్థాయిలో తమ గొంతుకే లేకుండా పోయిందని లద్దాఖ్‌ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రప్రతిపత్తి కావాలని, ప్రాంతాన్ని ఆరోషెడ్యూల్‌ కింద చేర్చి ఆదివాసీప్రాంతాలకు…

రాజకీయ చదరంగంలో .. 22 గజాల రణరంగం

‌”సూపర్‌ ఫోర్‌లోకి ఇండియా పాకిస్థాన్‌ చేరుకున్నాయి కాబట్టి, ఆనంద్‌ కు ఈ థాంక్‌ లెస్‌ జాబ్‌ సెప్టెంబర్‌ 21 ఆదివారం కూడా కొనసాగుతుంది. ఇండియా, పాక్‌ మరో సారి తలపడుతున్నాయి. సెప్టెంబర్‌ 28 నాటి ఫైనల్‌ లో కూడా ఈ రెండే తలపడే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఈ రెండుదేశాల మధ్య ఏం జరిగినా, అది…

మంచుకొండలను కూడా మండించిన నేపాలీ జెన్‌-జీ

“మూడోప్రపంచదేశాలలో తమకు గిట్టని ప్రభుత్వాలను కూలదోయడానికి అగ్రరాజ్యాలు, సైనికతిరుగుబాటు వంటి మార్గాలనే కాదు, ప్రజల తిరుగుబాట్లను కూడా ఆశ్రయిస్తాయి. తమకు వ్యతిరేకులైన సద్దాం హుస్సేన్‌ను, గడాఫీని ప్రజలపై నేరాలు చేసినవారిగా అభియోగాలు మోపి శిక్షించాయి. తాము రహస్యముఠాల ద్వారా చేయించే హత్యల కంటె, వీటికి హెచ్చు న్యాయబద్ధత ఉంటుందని ఆధిపత్యదేశాలకు తెలుసు. అట్లాగని, ప్రజల రాజకీయవ్యతిరేకతలన్నీ…

పంపకాల పంచాయితీలో ప్రజలకేమి పని?

“పార్టీ నుంచి రాజీనామా ప్రకటించిన సమావేశంలో ఆమె, కెసిఆర్‌ ప్రాథమిక కుటుంబాన్ని, అనుబంధ కుటుంబాన్ని వేరుచేశారు.కెసిఆర్‌, తాను, కెటిఆర్‌ ఒకటి, వరుస బంధువులు అయిన హరీశ్‌, సంతోష్‌లు వేరు.  అనుబంధ కుటుంబీకులైన హరీశ్‌, సంతోష్‌ లను నేరుగా, సూటిగా నిందించారు, అవినీతి ఆరోపణలు చేశారు. సంతోష్‌ విషయంలో అయితే, నిర్దిష్టంగా ఉదంతాలను చెప్పి, రేవంత్‌ రెడ్డి…

ట్రంప్‌ చెడుగుడుకు చైనా స్నేహమే విరుగుడు

“జాతీయవాదం పునాది మీద ఉద్వేగ రాజకీయాలు నడపడం పులిమీద సవారీ లాంటిది. యాభై ఆరు అంగుళాల ఛాతీతొ దృఢమైన నాయకుడిగా గుర్తింపు పొందిన దేశాధినేతకు, ఆచరణాత్మక రాజకీయాలు నడపవలసి రావడం కత్తిమీద సాము. అంతా సజావుగానే ఉన్నప్పుడు, ఒక నిర్హేతకమైన ధైర్యంతో, యథేచ్ఛగా మాట్లాడి, తరువాత తరువాత పరిస్థితి తారుమారయినప్పుడు, నంగి నంగిగా వ్యవహరించి, సవారీ…