Take a fresh look at your lifestyle.

బాపు….

శీకట్ల లేశీ నేను వాకింగ్‌ పోతుంటే
సల్లగత్తది బిడ్డ కుల్లబెట్టుకోమని
నీ నెత్తిమీద కుల్ల తీశిత్తవేమోనని
కొత్తింటి తలుపులకెల్లి ఆగాగి చూస్తున్న బాపు

నేను జబ్బకు సంచేసుకుని బడికి పోతుంటే
పైలంగ పోయిరా బిడ్డని చెబుతవేమోనని
ఇంటిముందర కట్టిన ఫ్లెక్సీలనీ
ఫోటువా కళ్ళల్లోకి
యెనక్కి తిరిగి తిరిగి చూస్తున్న బాపు

బాపూ…..
తొవ్వెంట పోకుంటా నిన్ను తలుసుకుంటే
నువ్వు పోయిన్నాడు నీ మీద సల్లిన పేలాలు కూడా
పట్నం తుమ్మల్లాగా కుచ్చుకుని నొప్పెడుతున్నై బాపు
నువ్వు లేవన్న సంగతి గుర్తొచ్చి

బాపూ…
నిన్ను తలుసుకుని
యెక్కెక్కి ఏడుసుకుంట అమ్మ
నన్ను చెల్లెళ్ళ తన చేతులకిందకు తీసుకుంటుంటే
తల్లికోడి రెక్కలకింద ముడుసుకుంటున్న కోడిపిళ్ళల్లెక్క
బిక్కుబిక్కుమంటూ పడుకుంటున్నం బాపు

బాపూ…
నీ పని ముగిశాక ఏ రాతిరో నీవు ఇంటికొస్తావని
తలుపులు తీశే పడుకుంటున్నాం…
నువ్వొచ్చినంకా మమ్ములా
నీ బొచ్చెమీదేసుకుని పడుకుంటావు కదా!

-దిలీప్‌.వి
జిల్లా ఉపాధ్యక్షులు
టి.పి.టి.ఎఫ్‌ ములుగు జిల్లా శాఖా
సెల్‌: 8464030808

Leave a Reply