Take a fresh look at your lifestyle.

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చి వరకు పివి మంత్రి వర్గం లో పని చేసిన దివంగత ప్రణబ్‌ ‌ముఖర్జీకి కూడా భారత రత్నను అందచేశారు. కానీ పివిని మాత్రం మరచి పోవడం దారుణమైన విషయంగానే చూడాలి. కాంగ్రెస్‌ ఎలాగూ పివిని గుర్తించలేదు. కనీసం బిజెపి అయినా గుర్తించక పోవడం ఆ పార్టీ దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. పివికి భారతరత్న ఇవ్వడమన్నది మనలను మనం గౌరవించు కున్నట్లే. త్వరలో హైదరాబాద్‌ ‌వేదికగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్నాయి. తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఇక్కడి నేతను స్మరించుకోవడానికి ఇదే సరైన సమయం.

అరుదైన రాజకీయ వ్యక్తిత్వం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంలో నేటికీ రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. సోనియా నేతృత్వం లోని యూపిఎ పదేళ్ల కాలంలోనూ..ఇప్పుడు మోడీ ఎనిమిదేళ్ల కాలంలోనూ రాజకీయంగా ఆయనను పక్కన పెట్టారు. బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీయాలకు ఓ హద్దు ఉండాలి. మన్మోహన్‌ ‌పదేళ్లు ప్రధానిగా ఉన్నా సోనియా చేతిలో కీలుబొమ్మగా పివిని స్మరించుకోవడానికి కూడా భయపడే వారు. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చివరకు పివి మంత్రివర్గంలో పనిచేసిన దివంగత ప్రణబ్‌ ‌ముఖర్జీకి కూడా భారతరత్నను అందచేశారు. కానీ పివిని మాత్రం మరచిపోవడం దారుణమైన విషయంగానే చూడాలి. కాంగ్రెస్‌ ఎలాగూ పివిని గుర్తించలేదు. కనీసం బిజెపి అయినా గుర్తించక పోవడం ఆ పార్టీ దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. పివికి భారతరత్న ఇవ్వడమన్నది మనలను మనం గౌరవించు కున్నట్లే. త్వరలో హైదరాబాద్‌ ‌వేదికగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్నాయి. తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఇక్కడి నేతను స్మరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఆజాదీకా అమృత మహోత్సవాల వేళ ఆయనకు భారతరత్న ఇచ్చే విషయమై చర్చించాలి. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ ‌రెడ్డి, ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మణ్‌, ఆపార్టీ నేతలు తరుణ్‌ ‌చుగ్‌,‌బండి సంజయ్‌ ‌లాంటి వారు పివికి భారతరత్నపై చర్చించాలి.

పివి దేశానికి చేసని సేవలకు గాను ఆయనకు గుర్తింపును ఇవ్వాలి. పివికి భారతరత్న ప్రకటిస్తే దానికే అందం,విలువ పెరుగుతుందని గుర్తించాలి. అయితే మోడీ సర్కార్‌ ‌పివిని తక్కువ చేసి చూసినంత మాత్రాన పివి వ్యక్తిత్వానికి వచ్చిన నష్టం ఏ లేదు. పివి శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ద్వారా తెలంగాణ సిఎం కెసిర్‌ ఆ ‌మహానుభావుడి పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు. ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు చేస్తూ పోయారు. నెక్లెస్‌ ‌రోడ్డ పేరును పివి మార్గ్ ‌నామకరణం చేసి, ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రాంభించారు. ఆయనకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఇలా చేస్తున్న తరుణంలో దిల్లీ పెద్దలు కనీసంగా కూడా స్మరించకపోవడం దారుణం కాక మరోటి కాదు. ఎగిరెగిరి పడుతున్న బిజెపి నేతలు ఇప్పుడు కూడా పివి గురించి మాట్లాడక పోతే వారిని జాతి క్షమించదు. తెలంగాణకు అదిచేసాం..ఇది చేసామని గొప్పలు చెబుతున్న వారెవరూ పివికి భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టలేదు. ఒకవేళ పివిని కాంగ్రెస్‌ ‌నేతగా చూసి ఆయనను విస్మరిస్తే అది భిజెపి భావదారిద్య్ర తప్ప మరోటి కాదు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వాలు కలిగిన వారు బహు అరుదుగా ఉంటారనడానికి పివి జీవితమే ఓ పాఠం. పదవుల కోసం,రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే నేతలున్న రోజుల్లో భారత్‌కు ఓ అణిముత్యం లాంటి నేత దొరికాడంటే అది ఓ పివి తప్ప మరొఒకరు కాదు. లాల్‌బహద్దూర్‌ ‌శాస్త్రి తరవాత అంతటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడు పివి మాత్రమే.

అలాగే పదవుల కోసం వెంపర్లాడుతున్న నేటి రాజకీయాల్లో పదవులు వాటంతటవే వెతుక్కుంటూ రావడం…వాటికి వన్నె తేవడం కూడా బహు అరుదు. ప్రపంచ దేశాల్లో పరువు పోయేలా భారత ఆర్థికస్థితి చిక్కుకున్న దశలో దానిని కాపాడేందుకే వచ్చాడా అన్న రీతిలో మహానుభావుడి రూపంలో పివి భారతదేశానికి ప్రధాని కావడం అన్నది మనదేశం చేసుకున్న సుకృతం కాక మరోటి కాదు. ప్రధాని రూపంలో కష్టకాలంలో మన రాజకీయాల్లో పివి సాక్షాత్కరించడం కూడా దేశం చేసుకున్న అదృష్టంగా చూడాలి. భారతదేశ ఆర్థికి స్థితిగతులను బేరీజు వేసుకున్నప్పుడు పివికి ముందు పివి తరవాత అన్న లెక్కలు వేసుకునే స్థితి మనది. అలాంటి వ్యక్తిని నీచాతినీచంగా చూసిన ఘనత సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌ ‌పార్టీది. ఆ మహానుభావుడి సేవలను కాదని ఆయనను తృణీకరించిన తీరుకు ఇప్పుడు కాంగ్రెస్‌ ‌తగిన మూల్యాన్నే చెల్లించుకుంటోంది. పీవీ జీవిత కాలంలో అనేక సందర్భాలలో, ఆయనను తక్కువగా అంచనా వేసిన కాంగ్రెస్‌ ఇక ఎప్పటికీ కోలుకోదు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ,ఊహించని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్‌ ‌సరళీకరణ విధానాన్ని రూపొందించి భారత్‌కు మార్గాన్ని చూపారు.ఇప్పటికైనా పివిని గుర్తుంచుకునేలా కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వడంతో పాటు, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచే కార్యక్రమాలను చేపట్టాలి. అది బిజెపికే గౌరవం కాగలదు. బిజెపి కార్యవర్గ సమావేశాల్లో పివి గురించి ప్రస్తావించాలి. అప్పుడే బిజెపికి కూడా గౌరవం దక్కుతుంది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply