Take a fresh look at your lifestyle.

ఒకే దేశం.. ఒకే మార్కెట్‌

  • సంస్కరణలకు కేంద్రం మరింత  పదును
  • రక్షణ రంగంలో ఎఫ్‌డిఐలను 74శాతానికి అనుమతి
  • ప్రైవేట్‌ ‌రంగంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధ్ది
  • నాలుగో విడత ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటన

పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే పక్రియ నిరంతరం జరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌, ‌బీఏఎఫ్‌ఆర్‌ అమలులో కేంద్ర ప్రభుత్వం చాలా ముందుందని చెప్పారు. రానున్న రోజుల్లో పోటీకి అనుగుణంగా భారత్‌ ‌సన్నద్ధం కావాలన్నారు. నాలుగో విడత ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మలాసీతారామన్‌, అనురాగ్‌ ‌ఠాకూర్‌లు శనివారం జరిగిన డియా సమావేశంలో వివరించారు. ఈ ప్యాకేజీలో పలు రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ అభియాన్‌ ‌పథకంలో నాలుగో విడతలో 8 రంగాలకు కేటాయింపులు చేశారు. బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.50వేల కోట్లు, కోల్‌మైన్‌ ‌సంస్కరణల వల్ల రూ.50వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించారు. ప్రజలకు నేరుగా నగదు అందించే విషయంలో ప్రభుత్వం ముందుందని మంత్రి నిర్మల పేర్కొన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీఅద్భుతమైన సంస్కరణలు చేపట్టారని దాని కారణంగా అనేక రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయన్నారు. ఒకే దేశం-ఒకే మార్కెట్‌ ‌విధానాన్ని అమలు చేస్తామన్నారు.

నాలుగోరోజు ప్రధానంగా సంస్కరణలపైనే దృష్టి సారించడం విశేషం. విమానాశ్రయాల అభివృద్ధికి ఏఏఐకి రూ. 2,300 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పీపీఈ పద్ధతిలో మరో ఆరు విమానాశ్రయాలను ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 12 ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేట్‌ ‌పెట్టుబడులకు అనుమతి ఇస్తామన్నారు. అంతరిక్షరంగంలో ప్రైవేటు పెట్టుబడు లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అంతరిక్ష ప్రయాణం, అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్‌ ‌సంస్థలకు అవకాశం కల్పిస్తారు. సంక్షేమరంగంలో మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేయ బోతున్నారు. సంక్షేమ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 8,100 కోట్లు కేటాయింపు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిస్కంల ప్రైవేటీకరణ, డిస్కంలు మనుగడ సాగేలా చర్యలు తీసుకుంటారు. దేశంలో 1991లో పీవీ ఆధ్వర్యంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తరువాత ఆర్ధిక రంగం పుంజుకుంది. కాగా, ఇప్పుడు మరలా ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకొస్తున్నారు.

ఉత్పత్తి రంగాలకు ఊతం:
ఆర్ధికంగా దేశం ఎదగడంతో పాటుగా, ఉత్పత్తి రంగాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందితే ఇక్కడి నుంచే అనేక వస్తువులు తయారవుతాయి. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే గతంలో మేక్‌ ఇన్‌ ఇం‌డియా తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్యాకేజీని ప్రకటించి కరోనా నుంచి నష్టపోయిన వ్యాపారాలను తిరిగి నిలబెట్టడమే కాకుండా, లాక్‌ ‌డౌన్‌ ‌తరువాత ఉత్పత్తి రంగం మరింత పుంజుకోవాదానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు టూరిజం, ట్రాన్స్‌పోర్ట్ ‌రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఒకే దేశం… ఒకే మార్కెట్‌ ‌ను అమలు చేయబోతున్నట్టు నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. దీని ద్వారా దేశంలో వ్యాపార రంగం పుంజుకునే అవకాశం ఉన్నట్టు తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ల్యాండ్‌ ‌బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలకు నేరుగా నగదు అందించే విషయంలో ప్రభుత్వం ముందుందని మంత్రి నిర్మల పేర్కొన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే పక్రియ నిరంతరం జరుగుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు.

Leave a Reply