వర్ధంతి సందర్భంగా వాజ్‌పేయ్‌కు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి నివాళి
న్యూఢిల్లీ, అగస్టు 16 : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢిల్లీలోని వాజ్ పేయి సమాధి దగ్గర రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు నివాళులర్పించారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయ్ పాలన గురించి బిజెపి నేతలు స్మరించుకున్నారు.
‘ఆప్యాయభరితం అయినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని మనం స్మరించుకొంటున్నాం..ఆయన స్నేహశీల స్వభావాన్ని మనం స్మరించుకొంటున్నాం..ఆయన వాక్చాతుర్యాన్ని, హాస్య ప్రియత్వాన్ని మనం స్మరించుకుంటున్నాం..మన దేశ ప్రగతికి ఆయన అందించిన తోడ్పాటు ను మనం స్మరించుకుంటున్నాం. అటల్ గారు మన పౌరుల మనసులలో, మస్తిష్కాలలో కొలువై ఉన్నారు. ఈ రోజున ఆయన వర్ధంతి నాడు నేను ‘సదైవ్ అటల్’ స్థలానికి వెళ్లి, ఆయనకు నివాళులు అర్పించాను’’ అని ప్రధాని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ సంగీత కచేరీ నిర్వహించారు.