ఎబివిపి అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
- లాఠీఛార్జ్‌తో అడ్డుకున్న పోలీసులు
- పలువురు విద్యార్థులకు
- తీవ్ర గాయాలు
- పోలీసుల కళ్లుగప్పి లోనికి వెళ్లే యత్నం
- రాష్ట్రంలో నిజాం పాలన సాగుతోంది : బండి సంజయ్ ఆగ్రహం
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఏబీవీపి విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు పోలీసుల కళ్లు గప్పి లోనికి ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది. ముందుగా సిద్ధం చేసుకున్న వ్యూహం ప్రకారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తామని ప్రకటించిన ఏబీవీపీ విద్యార్థులు దానిని రద్దు చేసుకుని బుధవారం హఠాత్తుగా గుంపులు గుంపులుగా తరలివచ్చి గేట్లు ఎక్కి అసెంబ్లీలోనికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో హతాశులైన పోలీసులు దొరికిన విద్యార్థిని దొరికినట్లుగా చితకబాదారు.
రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, 9 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్లను నియమించాలనీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలన్న డిమాండ్లతో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఏబీవీపీ విద్యార్థులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి అసెంబ్లీ ఆవరణలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గేట్లు ఎక్కి లోనికి ప్రవేశించేందుకు యత్నించిన విద్యార్థులను ఇష్టం వచ్చిన రీతిలో చావబాదారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అసెంబ్లీ గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులులాఠీ ఛార్జ్ చేశారు.
ఇందులో బాగంగా అదనపు డీసీపీ గంగిరెడ్డి విద్యార్థులను లాఠీతో ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. అంతేకాదు ఓ విద్యార్థి చెంపపై కొట్టారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగిరెడ్డిపై ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్లు మూసివేశారు. ఇక్కడ విద్యార్థులు తీవ్రంగా నిరసన తెలపడంతో.. అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని సర్కారు నాశనం చేసిందని విమర్శించారు.
9 యూనివర్సీటీలకు వెంటనే వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న 50వేల టీచర్ల పోస్టులను, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని దాని వల్ల తమకు స్కాలర్ షిప్‌లు రావడం లేదని విద్యార్థులు డియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన సాగుతోందని వారు ఆరోపించారు. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు బాదడం దారుణమని అన్నారు. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగానే తాము ఆందోళనకు దిగామని విద్యార్థులు తెలిపారు. నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని పలువురు నేతలు ఖండిస్తున్నారు.
సమస్యలు తీర్చమంటే చితకబాదతారా ? బండి సంజయ్
విద్యారంగ సమస్యలు తీర్చాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజాం పాలన సాగుతోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించమంటే ఇష్టం వచ్చినట్లు చితకబాదుతారా అని మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేంటని నిలదీశారు. విద్యార్థులను సంఘ విద్రోహశక్తులనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. ఉద్యమకారులమని చెప్పుకుంటూ విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నారని దుయ్యబట్టారు.
విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో గత పాలకులు చూశారనీ, త్వరకలోనే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు తీర్చే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. విద్యార్థులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
సమస్యలు తీర్చమంటే చితకబాదుతారా ?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్
విద్యారంగ సమస్యలు తీర్చాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజాం పాలన సాగుతోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించమంటే ఇష్టం వచ్చినట్లు చితకబాదుతారా అని మండిపడ్డారు.
విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేంటని నిలదీశారు. విద్యార్థులను సంఘ విద్రోహశక్తులనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. ఉద్యమకారులమని చెప్పుకుంటూ విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో గత పాలకులు చూశారనీ, త్వరకలోనే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు తీర్చే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. విద్యార్థులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.