Take a fresh look at your lifestyle.

వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి మంత్రి హరీష్‌రావు ఒఎస్డీ బాల్‌రాజు

సిద్ధిపేట : కొరోనా వ్యాధిని అరికట్టడానికి వైద్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒఎస్డీ బాల్‌రాజు అన్నారు. గురువారం నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నంగునూరు మండల వైద్య సిబ్బంది చేసిన సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన సన్మాన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కొరోనా ఫస్ట్ ‌వేవ్‌, ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవలో ముందున్న వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. కొరోనా వ్యాధి సోకింది అంటేనే అయిన వాళ్లు సైతం దూరం అవుతున్న తరుణంలో ప్రాణాలను ఫణంగా పెట్టి తామున్నామంటూ వైద్య సిబ్బంది అక్కున చేర్చుకొని సేవలు అందించారన్నారు. అలాగే మండలంలో కొరోనా టీకాలు వేయడంతోపాటు, కొరోనా టెస్టింగ్‌లో జిల్లాలోనే ముందు వరుసలో ఉందన్నారు.

జిల్లాలో ఎక్కడలేని విధంగా వైద్య సిబ్బంది చేసిన సేవలకు గుర్తింపుగా ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి మండల వైద్యాధికారి, ఎన్‌సిడి పోగ్రాం జిల్లా అధికారి డాక్టర్‌ ‌రాధికతో పాటు, పిహెచ్‌సి సూపర్‌వైజర్స్, ‌స్టాఫ్‌ ‌నర్సు , ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం, ‌హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లను మండలంలోని ప్రజాప్రతినిధులు సన్మానం చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. సిబ్బంది సేవలకు గుర్తింపుగా వారిని పేరుపేరునా గుర్తించి సన్మానం చేయడం వారిపై మరింత పనిభారాన్ని పెంచిందన్నారు. వైద్య సిబ్బంది సమస్యతో పనిచేస్తూ మంచి గుర్తింపు పొంది మరెన్నో సన్మానాలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. మండలంలోని పారామెడికల్‌ ‌సిబ్బంది సైతం గ్రామాల్లో చురుకుగా పని చేస్తున్నారన్నారు. వైద్యాధికారి డాక్టర్‌ ‌రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్‌ ‌రెడ్డి, మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌సారయ్య, ఏఎంసి మాజీ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు మైపాల్‌ ‌రెడ్డి, రమేశ్‌ ‌గౌడ్‌, ‌మండల మాజీ కో ఆప్షన్‌ ‌సభ్యుడు కమల్‌ ‌షరీఫ్‌, ‌సర్పంచి రాజేందర్‌, ఎం‌పిటిసి సుమలత చందు, మాజీ జెడ్పిటిసి దువ్వల మల్లయ్య, రంగు రాజు గౌడ్‌, ‌కనకరాజు మహేష్‌ ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, పారామెడికల్‌ ‌సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply