Take a fresh look at your lifestyle.

మేకిన్‌ ఇం‌డియా ప్రోత్సాంహతో మరింత ముందుకు

  • బడ్జెట్‌ ‌రూపకల్పన కూడా ఇందుకు అనుగుణంగా సాగింది
  • ప్రభుత్వ జోక్యం తగ్గించేలా చర్యలు
  • పారిశ్రామిక వేత్తలతో జరిగిన వెబ్‌నార్‌లో ప్రధాని మోడీ

దేశీయ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని, దీని కోసం మనమంతా కలిసికట్టుగా శ్రమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి వేగంగా, విస్తృతంగా కృషి చేయాలన్నారు. ఇందుకోసం ఉత్పాదక వ్యయం, నాణ్యత, సామర్థ్యం విషయంలో రాజీపడరాదన్నారు. తయారీ సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. దీని కోసం తన ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోం దని చెప్పారు. ఉత్పాదకతతో అనుసంధానమైన ప్రోత్సాహక పథకాల గురించి పారిశ్రామికవేత్తలతో శుక్రవారం జరిగిన వెబినార్‌లో మోదీ మాట్లాడారు. గడచిన ఆరేడుసంవత్సరాల్లో ’మేక్‌ ఇన్‌ ఇం‌డియా’ ను ప్రోత్సహించేందుకు విజయవంతంగా కృషి చేసినట్లు తెలిపారు. మన దేశంలో తయారీ రంగం అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడాలని చెప్పారు. ’కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన’పై తన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌రంగం ఆర్థిక వ్యవస్థలో ప్రతి అంశాన్ని మార్చుతుందని, అనేక అంశాలతో సహజీవనం చేయగలిగే వ్యవస్థను సృష్టిస్తుందని చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌సామర్థ్యం పెరిగితే, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. దీనికి ప్రపంచంలో అనేక దేశాలు ఉదాహరణగా నిలుస్తున్నట్లు వివరించారు. భారత దేశం కూడా ఇదే వైఖరితో ముందుకెళ్తోందని, తన ప్రభుత్వం ఈ రంగంలో ఒకదాని తర్వాత మరొక సంస్కరణను అమలు చేస్తోందని చెప్పారు. తన ప్రభుత్వ విధానం, వ్యూహం ప్రతి విషయంలోనూ చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. తయారీ రంగం వల్ల పర్యావరణంపై దుష్పభ్రావాలు పడకుండా, ఎటువంటి లోపాలు లేని ఉత్పత్తులు తయారు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగే విధంగా మన దేశ తయారీ రంగం శ్రమించాలని కోరారు. మన ఉత్పాదక వ్యయాలు, నాణ్యత, ఉత్పత్తుల సమర్థత అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపును సాధించాలన్నారు. దీని కోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

మన దేశ ఉత్పత్తులు తప్పనిసరిగా వాటిని ఉపయోగించేవారికి అత్యంత అనుకూలంగా, అత్యాధునికంగా, అందుబాటు ధరల్లో, స్థిరంగా నిలబడగలిగే విధంగా ఉండాలని చెప్పారు. ప్రతిదానిలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల పరిష్కారాలు లభించడం కన్నా మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని తన ప్రభుత్వం నమ్ముతోం దన్నారు. అందుకే తాము స్వీయ నియంత్రణ, స్వీయ ధ్రువీకరణ, స్వీయ నిర్థరణలను అవలంబిస్తున్నామని తెలిపారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. కేంద్ర బ్జడెట్‌, ‌విధాన నిర్ణయాలు కేవలం ప్రభుత్వ పక్రియగా మిగిలిపోకూడదన్నారు. దేశాభివృద్ధితో సంబంధం ఉన్నవారంతా దీనిలో సమగ్రంగా పాలుపంచుకోవాలన్నారు.

కేంద్ర బడ్జెట్‌ ‌ప్రణాళిక, దేశానికి సంబంధించిన విధాన రూపకల్పన కేవలం ప్రభుత్వ పక్రియకే పరిమితం కావద్దని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధిలో ప్రతి భాగస్వామి పాలుపంచుకోవాలని, చురుకైన పాత్ర పోషించాలనిసూచించారు. దేశంలో తయారీరంగాన్ని ఉరకలెత్తించ డానికి మనం భారీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మన దేశ కంపెనీలు ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీపడేలా చేయడం కోసం అహర్నిశలు కృషిచేయాల్సిన అసవరం ఉందన్నారు. ఏడాదిపాటు కరోనా మహమ్మారి ప్రభావాన్ని అనుభవించి ఇప్పుడిప్పుడే కోలుకుంటు న్నందున తయారీ రంగంలో దేశాన్ని పరుగులు తీయించడం మన బాధ్యతగా భావిస్తున్నానని, ఇది కేవలం అవకాశం మాత్రమే అనుకోవడం లేదని ప్రధాని చెప్పారు. తయారీరంగం దేశ ఆర్థికవ్యవస్థలోని ప్రతి సెగ్మెంట్‌లో మార్పులు తెస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తయారీరంగంలో వరుసగా సంస్కరణలు తీసుకొస్తున్నదని, తాము కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అనే సిద్దాంతాన్ని నమ్ముతున్నామని చెప్పారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మాట్లాడుతూ దేశంలోని యువత ప్రతిభను గ్రహించి మరింత పురోభివృద్ధి సాధించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని పాలసీలను అమలు పర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి రానున్న 25 ఏళ్లు ఎంతో కీలకమని ఆమె అన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఐడబ్ల్యూపీసీ ప్రెసర్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా బడ్జెట్‌ ఈ ‌విధానానికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. దేశాన్ని తయారీ రంగంగా చూపిస్తూనే వ్యాపార రంగానికి ప్రోత్సాహాన్ని తోడ్పాటును బడ్జెట్‌ అం‌దిస్తుందని నిర్మల అన్నారు.ఉద్దీపనల లక్ష్యాన్ని ఈ బడ్జెట్‌ ‌లో తాము ఆవిష్కరించగలిగామని అన్న నిర్మలా సీతారామన్‌.. ‌కరోనా మహమ్మారి సమయాన్ని దీనికి సమర్ధవంతంగా ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఏక కాలంలో సంస్కరణలు అమలు చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశామని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply