Take a fresh look at your lifestyle.

ఉపాధి, ఉద్యోగ రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వం 

  • ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్
ఉపాధి,ఉద్యోగ విద్య, వైద్యం మొదలగు సామాజిక రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు ఆసన్నమైనవని ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రజా పాలనను అమలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకోండి అని  తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వోటర్లకు విజ్ఞప్తి చేశారు.
కుబేర లకు ధనురాశులు సమకూర్చుతూ దేశంలో 162 మంది బిలియనీర్స్ అవతరింపజేసిన కీర్తి మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని అభిప్రాయపడ్డారు.10శాతం జనాభా కూడా లేని  ధనవంతులకు దేశ సంపదలో 72శాతం సమకూర్చిన ప్రధాని మోదీ ప్రతి వార్షిక సంవత్సర  ఆదాయంలో కేవలం ఒక్క శాతం ప్రజలు ఉన్న ధనవంతులకు 25 శాతం ఆదాయం దక్కుతున్నా, దేశం వెలిగిపోతున్నదని, ప్రకాశిస్తున్నదని డంబాచారం చేయడం పేద ప్రజలను అగౌరవపరచడమేనని ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ ఎద్దేవా చేశారు. ఉప్పు మీద ,పప్పు మీద, నిత్యవసర వస్తువులు పెట్రోల్ డీజిల్ మీద వేసిన  జిఎస్టి కారణంగా చిరు వ్యాపార వ్యవస్థలు అన్ని విధ్వంసంకు గురి అయినాయి. మోదీ పాలనలో అదానీ,అంబానీ వేదాంత మొదలగు ధనవంతులకే ప్రయోజనాలు జరిగే విధంగా మేలు చేస్తున్నారని ఆవేదన వెలుబుచ్చారు.
సమాజ అభివృద్ధికి తోడ్పడే విద్య ,వైద్య ఉపాధి ఉద్యోగ రంగాలను మోదీ పాలనలో నిర్వీర్యం చేయడం జరిగిందని
వేలాది డిగ్రీ కళాశాలల్లో 450 పైగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు గత పది సంవత్సరాల నుండి కేంద్రం ఒక్క చిల్లి గవ్వ కూడా చెల్లించకపోవడం వల్ల విద్యాసంస్థలు మూసివేతకు సిద్ధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాలయాలకు లక్షల రూపాయల ఫీజులు చెల్లించి పట్టాలు  పొందిన యువతి,యువకులకు ఉపాధి,ఉద్యోగాలు లభించని దేశాన్ని సంపన్న దేశంగా ఏవిధంగా అంటారని ప్రశ్నించారు.  విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల జేఏసి వైస్ చైర్మన్, ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ ప్రతి దశాబ్దానికి ఒకసారి జనాభా లెక్కలు చేసే విధానాన్ని కూడా మోదీ ప్రభుత్వం నిలిపివేసిందని దుయ్యబట్టారు. పేద వర్గాల  సామాజిక ,ఆర్థిక స్థితిగతులను తెలియజేసే జనాభా లెక్కలు ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే మోదీ ప్రభుత్వం ఆపివేసిందని దానికి మోదీ సమాధానం చెప్పాలని కోరుతున్నాం. జనగణన చేయని మోదీ కి జనగణమన పాడే రోజులు దగ్గర పడ్డాయని మల్లేశ్వర్ అభిప్రాయపడ్డారు.
ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ నీలం సంపత్ కుమార్, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, డాక్టర్ వంగాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply