జగదేవ్‌పూర్ : టిఆర్ఎస్ పార్టీకి గ్రామ కమిటీలే పట్టుకొమ్మలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ ఛైర్మన్ మడుపు భూంరెడ్డి అన్నారు. పార్టీ కమిటీలలో భాగంగా గురువారం జగదేవ్‌పూర్ మండలంలోని పలు గ్రామాలలో పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు వేశారు. వట్టిపల్లి, తిమ్మాపూర్ తదితర గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నూతన కమిటీలను కార్యకర్తల సమక్షంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భూంరెడ్డి , పనుగట్ల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..కార్యకర్తలకు పార్టీ తరపున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరూ గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా భూమా విజయ్ కుమార్ ను, తిమ్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అంగడి మహేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరిద్దరికి నేతలు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, జగదేవ్‌పూర్ పిఏసిఎస్ ఛైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు, మునిగడప ఎంపిటిసి కిరణ్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు అంకిల్లా యాదవ రెడ్డి, ఎగ్బాల్, రాచర్ల నరేష్, లక్ష్మీ రమేష్, కొత్త కవిత శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లయ్య, కనకయ్య, శ్యామ్ సుందర్ రెడ్డి, రాములు, కనకయ్య, సత్యనారాయణ, కనకయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.