Take a fresh look at your lifestyle.

బాల సాహిత్యంపై ‘‘ఆఫ్‌ లైన్‌’’ కథల ప్రభావం

బాల సాహిత్యంలో కథలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.. పిల్లల మానసిక, నైతిక, సామాజిక అభివృద్ధికి ఇవి దోహదపడుతున్నాయి.ఊహాశక్తిని పెంపొందించడం, భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం, విలువలను నేర్పించడం వంటి అనేక విధాలుగా కథలు పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలు కథలు వినడం లేదా చదవడం ద్వారా కొత్త ప్రపంచాలను ఊహించుకోవడం నేర్చుకుం టారు. పాత్రలతో సానుభూతి చెందడం, వారి సాహసాలను ఊహించడం ద్వారా వారి ఊహాశక్తి విస్తరిస్తుంది. సృజనాత్మకత పెంపొందడానికి, స్వంత కథలను రాయడానికి, ఈ కథలు వారికి స్ఫూర్తినిస్తాయి.

కథలు పిల్లలకు కొత్త పదాలు, వాక్యాలను నేర్పిస్తాయి.కథ చెప్పేవారి భాషను అనుకరించడం ద్వారా వారి స్వంత భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కథలు వారికి ప్రోత్సాహాన్నిస్తాయి. ప్రముఖ కథ రచయిత ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు. ముక్క మాల జానకిరామ్‌ ఈ మధ్యకాలంలో సామాజిక నైతిక విలువలతో కూడిన కథలను రాస్తూ బాల సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ముక్క మాల జానకిరామ్‌ రచించిన ఆఫ్లైన్‌ కథలు. డిజిటల్‌ యుగంలో బాలసాహిత్యం యొక్క ప్రస్థానాన్ని తెలియజేస్తుంది. డిజిటల్‌ పరికరాలకు ఎక్కువగా అలవాటు పడిన నేటి పిల్లలకు ఊహాశక్తి సృజనాత్మకత సానుభూతిని పెంపొందించడంలో ఆఫ్‌ లైన్‌ కథలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.

’’అంతర్జాలంలో ఉడత’’జామర్‌ అనే పేరు గల ఉడత ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో గేమ్స్‌ ఆడి ఓడిపోయి తన మిత్రుడైన రూటర్‌ అనే పేరుగల కుందేల ద్వారా రక్షించబడిన విధానాన్ని తెలియజేస్తూ. నేటి సమాజంలో ఆన్లైన్‌ అపరిచితుల వ్యక్తుల ప్రమాదాన్ని వారి ప్రభావాన్ని గురించి కంప్యూటర్‌ పదబంధాల భాషలో జీవిత విలువలను తెలియజే సిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది.’’రంగురంగుల కాకి’’ఈ కథలో కాకి నలుపు రంగును చూసి నేటి సమాజంలో అందరూ చీదరించుకోవడం దానికి బాధపడిన కాకి తన రంగులను మార్చుకొని అడవిలో తిరగటం ఆ తర్వాత తనకు పరిచయమైన కోకిల ఒక తరగతి గది దగ్గర ఉపాధ్యాయుడు చెపుతున్న కాకి యొక్క గొప్పతనాన్ని వినిపించిన తర్వాత కాకిలో తన యొక్క గుణాలను గుర్తు చేసుకొని తన రంగులన్నిటిని కడుక్కొని తన సహజంగా బ్రతకడం నేర్చుకుంది. ఈ కథలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రంగులను మార్చేటటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు వారి యొక్క సహజత్వాన్ని కోల్పోకూడదు అని నీతిని ఈ కథలో తెలియజేశారు ముకమల జానకిరామ్‌.శుభోదయం.. జ్ఞానోదయం! పట్టణములో చదువుకునే తన మనవడు పల్లెటూరికి వచ్చి పల్లెల్లో ఉన్న పశువులు పక్షులు చీపురులు ఉదయం పూట కోడికూతలు అరకలు వాటి శబ్దాలు ఆవులు గేదెలు అవి ఇచ్చే పాలు వాటి యొక్క ప్రాముఖ్యత ఉదయాన్నే మేల్కొని ప్రకృతిలో వివిధ పక్షులు వివిధ వ్యక్తులు వారి పని చేసే విధానాన్ని గమనించిన అర్జున్‌ సంక్రాంతి సెలవుల తరువాత తిరిగి తన బడిగిపోయి తనలో గొప్ప మార్పును చూపించాడు సమయానికి పాఠశాలకు పోవడం సమయానికి పాఠాలు చదువుకోవటం ఉదయాన్నే లేవటం తన పనులు తాను చేసుకోవడం అంటే ఈ కథలో పల్లె నుంచి ఎంత నేర్చుకోవచ్చు ఒక విద్యార్థి ఏ స్థాయిలో తనను తాను మలుచు పిలుచుకున్నాడు.

జీవితానికి క్రమశిక్షణ ఎంత అవసరం ప్రకృతి అనుసారం జీవించటం ఎంత అవసరం అనే నైతికతను ఈ కథలో వివరించారు కథ రచయిత.’’తెరపై స్నేహం.. తెర వెనుక ద్రోహం’’బ్రూసీ అనే పేరు గల కుందేలు అమెజాన్‌ అడవుల్లో ఆడుకుంటూ సెల్ఫీలన్నీ ఫేస్బుక్లో షేర్‌ చేసింది. బాంబి అనే పేరు గల నక్క కుందేలు రూపంలో పోస్ట్‌ రిక్వెస్ట్‌ పెట్టి దాన్ని తినాలనే ప్రయత్నం చేసింది. ఆన్లైన్లో అపరిచితుల పోస్ట్‌ రిక్వెస్ట్‌ వచ్చే లైక్‌ చేసి మోసపోయే ఎందరో యువతీ యువకులకు ఈ కథ మార్గదర్శిని చూపిస్తుంది.’’అమ్మ నేర్పిన పాఠం’’నేటి కాలంలో పిల్లలు ఫాస్ట్‌ ఫుడ్‌ ఫీజులకు అలవాటు పడి ఫుడ్‌ క్రమశిక్షణ తప్పి అనేక రకాలైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్న సందర్భంలో లహరి తల్లి తన ఇంట్లో పెంచుకునే రెండు కుక్క పిల్లలకి మిల్కీ కి మంచి ఆహార పదార్థాలు ఇచ్చి పప్పికి నూనె పదార్థాలు ఇచ్చి పప్పీ అనారోగ్యానికి గురికావడంతో అది తెలుసుకున్న లహరి ఆ రోజు నుంచి మంచి ఆహార పదార్థాలు తీసుకొని క్రమశిక్షణతో పాఠశాలకు పోవడం మొదలుపెట్టింది. కలుషిత ఆహారం తిని ఆరోగ్యం పాడు చేసుకునే నేటి పిల్లలకు ఈ కథ మంచి మార్గాన్ని చూపిస్తుంది. ఆఫ్‌ లైన్‌ ఈ కథలో అర్జున్‌ నిత్యం ఆన్లైన్లో ఫ్రెండ్స్‌ తో గడిపేవాడు వేసవి సెలవుల్లో తన తాతగారు ఇంటికి రావడంతో తాతగారు చెప్పే వివిధ కథలను వింటూ కథల పుస్తకాలు చదువుతూ నెల రోజులు హాయిగా గడిపేశాడు. ఆ తరువాత ఆన్లైన్‌ కంటే ఆఫ్లైన్లోనే ఎక్కువ ఆనందం ఉందని తెలుసుకున్న అర్జున్‌ ట్యాబ్‌ తన నాన్నకి ఇచ్చేసి ఆఫ్లైన్లో జీవించడం మొదలు మొదలుపెట్టాడు. నిజమే కదా ఆన్లైన్‌ లో అందుకోలేని ఆనందాన్ని ఆఫ్లైన్లో తెలుసుకోవడం ఈ కథ ద్వారా ఆఫ్లైన్‌ ఆనందాలు అందిపుచ్చుకోవటం ఎలా అనేది కథ రచయిత తెలియజేశారు.’’అలరించే ఆఫ్‌ లైన్‌ కథలు’’పేరుతోటి బూర్లె నాగేశ్వరరావు ముందుమాట అందించారు.

‘‘బాలల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కథకుడు’’అంటూ ప్రముఖ బాల సాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి (తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి సాహిత్య పురస్కార గ్రహీత) మంచి ఆలోచనత్మకమైన మాటలను అందించారు.’’బాల సాహిత్య విజ్ఞాన రేఖ అఫ్‌ లైన్‌ కథలు’’అంటూ పైడిమర్రి రామకృష్ణ బాల సాహిత్య పరిషత్‌ కోశాధికారి ఈ కథల యొక్క ప్రాధాన్యతను గురించి ముందు మాటను అందించారు. అఫ్‌ లైన్‌ కథలు పుస్తక రచయిత ముక్క మాల జానకి రామ్‌ తన చిన్నతనం నుండి పెరిగిన తన ఊరు తన తల్లిదండ్రులు తన పల్లె జీవన విధానము స్నేహితులు తన కష్టపడి చదువుకున్న విధానం తన చదువు ద్వారా తెలుసుకున్న కథలు నీతి కథలు గురించి స్పష్టంగా తెలియజేయడమే కాకుండా. తను ఒక ఉపాధ్యాయుడిగా కథా రచయితలుగా ఎదగటానికి తెలుగు సాహిత్యం కథలు తనపై ఎంత ప్రభావాన్ని చూపాయో చాలా విస్తృతమైన పరిశీలనాత్మకమైన తన జీవితాన్ని జీవన గమనాన్ని ఈ పుస్తకంలో పంచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ నేటి బాలలను ఆన్లైన్‌ నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆఫ్లైన్‌ కథల ద్వారా ఎందరో విద్యార్థులను చైతన్య పరచి తను పనిచేస్తున్న మేళ్లచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఎందరో విద్యార్థినీ విద్యార్థుల చేత కథలు రాయిస్తూ తను రాస్తూ వివిధ పత్రికల్లో ముద్రింప చేస్తున్నారు. దీని ద్వారా నేటి తరం విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించుటలో  ముక్క మాల జానకిరామ్‌ తనదైన పాత్రను పోషిస్తున్నారు . ఆఫ్‌ లైన్‌ కథల ఈ పుస్తకం నేటి బాల సాహిత్యం పై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల మానసిక సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది అనుటలు ఎలాంటి సందేహం లేదు. చదవడం రాయడం వంటి భాష నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి ఈ ఆఫ్‌ లైన్‌ కథలో పుస్తకం పిల్లలకు ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ కథ రచయితక ముక్కా మాల జానకిరామ్‌ నుండి మరిన్ని బాల సాహిత్య కథలు రావాలని  ఆశిస్తూ.
-పూసపాటి వేదాద్రి
9912197694

Leave a Reply