Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ద్రోణి విస్తరణ
44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏ శ్రావణి తెలిపారు. తెలంగాణలో టెంపరేచర్లు పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు. గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హీట్‌వేవ్‌ బిల్డప్‌ అవుతుందని, చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నట్లు ఆమె చెప్పారు. మరో మూడు రోజుల పాటు ఇలాంటి టెంపరేచర్లే కొనసాగనున్నట్లు శ్రావణి తెలిపారు.

ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయనున్నట్లు ఆమె వెల్లడిరచారు. కాగా ఎండలు మండుతున్న వేళ కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ కూల్‌ న్యూస్‌ అందించింది. ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఈ నెల 6వ తేదీన కరీంనగర్‌, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ ఛత్తీస్‌ గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, రాయలసీమ వ్నిదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.వ్ని ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గూడపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో 47 డిగ్రీల మార్క్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు దీర్ఘకాల వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

Leave a Reply