Take a fresh look at your lifestyle.

వోట్లకోసం కాంగ్రెస్‌ ‌నీచరాజకీయాలు

రైతుల పొట్టకొట్టడానికి సిద్ధం
కాంగ్రెస్‌ను నమ్మితే రాష్ట్ర అభివృద్ధి గంగలో : ఎంఎల్‌సి కవిత

నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌నాలుగు వోట్ల  కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్‌ ‌తెరలేపింది అని కవిత మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ సుస్థిరత సాధించింది.. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటదన్నారు. ఐటీ డెవలప్‌మెంట్‌లో బెంగళూరును క్రాస్‌ ‌చేశామన్నారు. రాష్ట్రానికి ఐటీ హబ్‌లు వచ్చాయి.. ఇండస్ట్రీయల్‌ ‌జోన్లు కూడా వస్తున్నాయని తెలిపారు. తెలంగాణను పట్టణీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్‌ ఆరోపణలు చూస్తే వాళ్ల అభద్రతా భావం కనిస్పిస్తుంది. అందుకే సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్‌ ‌రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్‌ ‌గజ్వేల్‌లో పోటీ చేసిన తమ పార్టీకి వచ్చే నష్టమే లేదని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత డియాతో చిట్‌చాట్‌ ‌చేశారు.

ఈ ఎన్నికలు రాహుల్‌ ‌గాంధీ, రైతులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కవిత పేర్కొన్నారు. రైతుబంధు ఆపాలన్న కాంగ్రెస్‌ ‌పార్టీకి రైతులు తగినబుద్ది చెప్తారన్నారు. పేదలకు రేషన్‌ ‌బియ్యం, ఆసరా పెన్షన్లు, బీడీ పెన్షన్లు, మిషన్‌ ‌భగీరథ తాగునీరు, ఇండ్లకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్‌, ‌షాదీ ముబారక్‌, ‌కల్యాణలక్ష్మి.. ఈ పథకాలన్నింటినీ ఎన్నికల కోడ్‌ ‌పేరు చెప్పి ఆపేందుకు కాంగ్రెస్‌ ‌కుట్ర చేస్తుందా..? దీనికి రాహుల్‌ ‌గాంధీ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్‌ ‌చేశారు.తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంట్‌ ‌వచ్చింది కదా.. కాంగ్రెస్‌ ‌వాళ్ల ఇండ్లకు కూడా కరెంట్‌ ఆపాల్సిన అవసరం ఉందన్నారు కవిత. బీజేపీ లాగా పేర్లు మార్చి పథకాలు పెట్టడం లేదన్నారు. యూపీఎస్సీ తరహా జాబ్‌ ‌క్యాలెండర్‌ అనే కాంగ్రెస్‌ ‌హా.. ఎన్నికల హా మాత్రమే అని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో జాబ్‌ ‌క్యాలెండర్‌ ఎం‌దుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని కవిత ధ్వజమెత్తారు. 2010లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీలను చేర్చకుండా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని మండిపడ్డారు.

Leave a Reply