Take a fresh look at your lifestyle.

‌రేపటి నుంచి డిసెంబర్‌ 9 ‌వరకు నిరుద్యోగంపై పోరాటం

  • అఖిల పక్షభేటీలో పార్టీల నిర్ణయం
  • కలసి పోరాడుతామన్న మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేసే హక్కు కూడా లేదని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందన్నారు. విద్య, ఉద్యోగ రంగాలలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వ శాఖలలో ఖాళీలు కూడా పూర్తి చేయడం లేదన్నారు. పాలకుల నియంత పోకడలపై పార్టీలు కలిసి పోరాటం చేయాలని చెప్పారు. అక్టోబర్‌ 2 ‌నుంచి డిసెంబర్‌ 9 ‌వరకు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి అన్ని పక్షాలు మద్దతు తెలిపాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన అఖిలపక్షభేటీ అనంతరం భట్టి వి•డియాతో మాట్లాడారు. అక్టోబర్‌ 2 ‌నుంచి డిసెంబర్‌ 9 ‌వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మాతో కలసివచ్చే పార్టీలను కోరడం జరిగిందన్నారు.

తమ ప్రతిపాదనకు వి•టింగ్‌లో పాల్గొన్న అన్ని పక్షాలు సూతప్రాయంగా మద్దతు తెలిపాయి. పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్‌ ‌చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామన్నాయి. మాతో కలిసి వచ్చే పార్టీలే కాదు.. ఆ పార్టీల అనుబంధ సంఘాలు కూడా మాతో కలసి పని చేస్తాయని భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు.. పోడు భూముల సమస్యపై పోరాటం ఉదృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామని సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌తో కలసి పోరాటం చేస్తాం. ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కేసీఆర్‌ ‌విఫలం అయ్యాడు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలసి పనిచేసినట్లుగానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలసి పనిచేయాలి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపే అంశంపై మా పార్టీ లో చర్చించి మరోసారి సమావేశం అవుతామని చాడ వెంకటరెడ్డి తెలిపారు.

Leave a Reply