Take a fresh look at your lifestyle.

సదాశివపేటను అభివృద్ధిలో.. నంబర్‌ ‌వన్‌ ‌చేయాలి: హరీష్‌రావు

Harishrao Rao calls on officials
అధికారులకు ఆర్థ్ధికశాఖ మంత్రి హరీష్‌రావు పిలుపు

అభివృద్ధిలో సదాశివపేటను నెంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో ఉంచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పట్ణణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలో స్తంభాలు, ఫుట్‌ ‌పాత్‌ ‌లపై ట్రాన్స్ఫార్మర్లు లేకుండా చూడాలని, మొత్తంగా ప్రమాద రహితమైన విద్యుత్‌ ‌వ్యవస్థ లేకుండా చూడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు విద్యుత్‌ అదికారులకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యాక్రమంలో భాగంగా 10 రోజుల పాటు చేపట్టిన ఏ కార్యక్రమంలో మంత్రి సదాశివపేట పట్టణంలోని గోల్లకెరీ కాలనీ లో పలు ప్రాంతాల ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు .విద్యుత్తు అధికారులకు పలు సూచనలు చేసినారు. 4. 16 వ వార్డ్ ‌లో స్థానికులు విద్యుత్తు వైరులు మరియు లౌ వోల్టాజ్‌ ‌సమస్యలు మంత్రి గారి ద్రుష్టి కి తీసుకురాగా అన్నీప్రాంతాలలో ప్రమాద రహితమైన విద్త్యుట్‌ ‌వ్యవస్థను మెరుగు పరచాలని అందుకు అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విద్యుత్‌ అధికారులకు సూచించారు. అలాగే వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే ట్రాన్ఫార్మార్లను మార్చాలని, ఇండ్లపై వేలాడే వైర్లను సరిచేయాలని, చిన్న స్తంభాలను తొలగించి పెద్ద స్తంభాలు వేయాలని అన్నారు. ఇట్టి పనులకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సమర్పిస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. విద్యుత్‌ అధికారులు ప్రతిరోజూ విద్యుత్‌ ‌తీగలను, ట్రాన్ఫార్మార్లను తనిఖీ చేయాలని, పగటి పూటా ఎక్కడ బల్బ్ ‌లు వెలగకుండా చూడాలని అన్నారు. వీధి లైట్లు చక్కగా వెలిగేలా చూడాలని అన్నారు. రహదారులపై గుంతలు, బొందలు, గోతులు ఉండకూడధని, పచ్చదనంతో పట్టణం కళకళలాడాలని హితవు పలికారు. చెత్త నిర్మూలనకు డంప్‌ ‌యార్డులు ఏర్పాటు చేసుకోవాలని, చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపేందుకు దహనవాటికలు, ఖనన వాటికలు ఉండాలన్నారు.

అనంతరం 16వ వర్డ్ ‌వద్ద స్థానిక ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు .పట్టణ ప్రగతి పై ఏర్పాటు చేసిన కమిటీలతో మాట్లాడారు. ఈ కాలనీ మానధని అందరం మన వార్డును శుబ్రంగా ఉంచుకోవాలని, మొక్కలను పెంచడంతో పాటు వాతూనికాపాడుకోవాలని అన్నారు. ప్లాస్టిక్‌ ‌రహిత సదాశివపేట గా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్‌రావు మహిళలకు, ప్రజలకు సూచించారు. అందరికీ తడి, పొడి చెత్త బుట్టలు ఇచ్చామని, వంద శాతం తడి, పొడి చెత్త సేకరణకు చేత్త్ ‌బుట్టలు ఇచ్చామని, సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే రూ.500 జరిమానా విధించాలని మంత్రి అధికారులకు సూచించారు. చెత్త సేకరణ, ట్రాక్టర్‌ను ఆటో ల ను తర్వలో పంపిణీ చేస్తామన్నారు. చెత్త సేకరణ కు ఎటువంటి పైకము చెల్లించవలసిన అవసరం లేదని అన్నారు. యువత తో మాట్లాడుతూ హరిత హారము లో యువత భాగస్వామ్యం కావాలని, ఇక్కడ చెట్లను నాటి బ్రతికించవలెనని అన్నారు. మహిళలకు మహిళ భవనం చెరువు కట్ట దగ్గర బతుకమ్మ నమునని, ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఎం. ‌హనుమంత రావు మాట్లాడుతూ ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీ చేశామని, ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైనన్ని వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చెత్తను డ్రైనేజీలు వేయకూడధని, రోగాలుఎప్పటి దరిచేరకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేసుకోవాలని అన్నారు. కొత్త మున్సిపల్‌ ‌చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణం, లే అవుట్‌ ‌విషయంలో సులభతరమైన అనుమతుల విధానం తెచ్చామని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలపై నమ్మకం ఉంచాం. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌హెచ్చరించారు.

ప్రతీ పట్టణానికి డంపుయార్డులు నిర్మించి తడి-పొడి చెత్తను వేరు చేయాలన్నారు. తడి చెత్తను వర్మీకంపోస్టుగా తయారీ చేసి మొక్కలకు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు..మన ఆరోగ్యము మనమే కాపాడుకోవాలన్నారుమన చేతిలోనే మన పట్టణము వుంది కావునా మన సదాశివపేట ని సుందరముగా వుంచుకొందామన్నారు .పట్టణములో సి .సి కెమెరాల ను ఏర్పాటు చెత్తామని అన్నారు. చెత్తను రోడ్డు పై వేసే వారికి జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. 4,16వ వర్డ్ ‌కాలనీ ని మోడల్‌ ‌కాలనీ గా చేద్దామని ఇందుకు అందరూ కలిసి కట్టుగా ముందడుగు వేద్దామని పట్టణాన్ని చెత్త లేకుండా చేద్దామని, అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ‌ప్రజాల్కు పిలుపు నిచ్చారు. అనంతరం వార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ ‌పరిధిలోని 26 వార్డులను సందర్శించి ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామని, దశల వారీగా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రోడ్లపై చెత్తను వేయవద్దని, చెత్త సేకరణకు వాహనాలు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేయాలన్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచినట్లే పరిసర ప్రాంతాలను సైతం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి రోజూ మున్సిపల్‌ ‌కార్మికులు వార్డుల్లో డ్రైనేజీల్లో పూడికను తీయించాలని అధికారులను ఆదేశించారు. ఈగలు, దోమలు ప్రబలకుండా మురికి నీరు నిలువ ఉన్న చోట్ల బ్లీచింగ్‌ ‌పౌడర్‌ను వేయలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!