Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు   37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు

సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్‌ కేంద్రాలలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 94.20శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ పోటీలో 13 గుర్పింపు కార్మిక సంఘాలు పోటీ పడ్డాయి. కానీ ప్రధాన కార్మిక సంఘాలైన ఎఐటియూసి, ఐఎన్‌టియూసి, టిబిజికెఎస్‌, సిఐటియూసి ల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వేయాల్సి ఉండగా మధ్యాహ్నం భోజన సమయానికి అన్ని ఏరియాల్లో కలిపి 26815 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 67.42 శాతం ఓట్లు పాలయ్యాయి. కార్పొరేట్‌ లో 887, కొత్తగూడెం ఏరియాలో 1545, ఇల్లందు 500, మణుగూరు 1716, ఆర్జీ 1లో 1748, 1874, ఆర్జీ2లో 2129, ఆర్జీ3లో 2678, భూపాలపల్లి 3660, బెల్లంపల్లి 756, మండమర్రి 3061, శ్రీరామ్‌ పూర్‌ 3730, 2536 మొత్తం కలిపి 67.42 శాతం ఓట్లు పోల్‌ ఆయ్యాయి. భోజన విరామ సమయం తరువాత అన్ని ఏరియాల్లో కలిపి 10617 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం ఓటింగ్‌ సమయం ముగిసేసరికి 94.20శాతంతో మొత్తం 37468 ఓటింగ్‌ నమోదు అయ్యింది.

ఆర్జీ 1లోని 1వఏరియాలో 2212, 2వ ఏరియాలో2852 , ఆర్జీ2లో 3369, ఆర్జీ3లో 3612, భూపాలపల్లి 5123, బెల్లంపల్లి 959, మండమర్రి 4515, శ్రీరామ్‌ పూర్‌లోని 1వ ఏరియాలో 4902, 2వ ఏరియాలో 3589 మంది సింగరేణియులు ఓటు వేశారు. అదే విధంగా  భద్రాద్రి జిల్లాలోని కార్పోరేట్‌ ఏరియా హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌ కలుపుకుని 1146, కొత్తగూడెం ఏరియాలొ 2207, ఇల్లందులో604, మణుగూరు ఏరియాలో 2378 ఓట్లు పోల్‌ అయ్యాయి. కార్మిక సంఘాల నాయకులు పోలింగ్‌ బూత్‌ల వద్ద హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు.జిల్లాలో మొత్తం 6581 మంది కార్మిక ఓటర్లు ఉండగా అందులో 6335 ఓట్లు పోల్‌ అయ్యాయి. రాత్రి 7గంటల నుండి అన్ని ఏరియాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారు.

ఈ 11 డివిజన్‌లలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్లే ఆసంఘాన్ని గుర్తింపు సంఘంగా అధికారికం ప్రకటిస్తారు అధికారులు. కార్మిక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు  తాళాలు ఇచ్చేందుకు యూనియన్‌ నేతలు పోటీ పడ్డారు. దీనితో గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. కార్మికుల కోసం మేనిఫెస్టోను బ్యానర్ల రూపంలో సైతం సిద్దం చేశాయి యూనియన్లు.పోలింగ్‌ కేంద్రాల వద్ద విస్తృత ప్రచారం కొనసాగిస్తు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. సింగరేణి సంస్థలో కార్మిక గుర్తింపు సంఘం హోదా మాదే అంటే మాదే అంటూ ప్రధాన గుర్తింపు సంఘాల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లెక్క తేలాలీ అంటూ ఓట్ల లెక్కింపు పూర్తి అయితే గానీ సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం హోదా తెలుస్తుంది. అయితే 2017 తురువాత నుండి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగలేదు. తెలంగాణ ఏర్పడిన తురువాత కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం ఇది మూడవ సారి కావడం గమనార్హం.

Leave a Reply