Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొరోనాపై సీసీఎంబీ సంచలన నివేదిక 6.6 లక్షల మందికి వైరస్‌ ‌సోకిందని అంచనా

  • మురుగు నీటిలోనూ కొరోనా వైరస్‌ ఆనవాళ్లు
  • సిసిఎంబి పరిశోధనల్లో గుర్తింపు

తెలంగాణలో కొరోనా వైరస్‌కు సంబంధించి సెంటర్‌ ‌ఫర్‌ ‌సెల్యులార్‌ అం‌డ్‌ ‌మాలిక్యులర్‌ ‌బయాలజీ (సీసీఎంబీ) సంచలన నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 6.6 లక్షల మంది ఈ వైరస్‌ ‌బారిన పడినట్లు అంచనా వేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో వచ్చిన కేసుల మొత్తం కంటే ఈ సంఖ్య 7 రెట్లు అధికం. అంటే హైదరాబాద్‌ ‌నగర జనాభా కోటితో లెక్కిస్తే ఇది 6.6 శాతంగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 35 రోజుల కాల పరిమితిని తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. అయితే, వైరస్‌ ‌సోకిన వారిలో ఎక్కువ మందిలో ఎవరికీ ఈ లక్షణాలు కనిపించలేదని నివేదికలో వెల్లడించారు. వైరస్‌ ‌లక్షణాలు లేని వారు దవాఖానాలలో చేరాల్సిన అవసరం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. కొరోనా వైరస్‌ ‌సోకిన వారి నాసికా ద్రావాలు, నోటి మార్గాల మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా బహిర్గతం అవుతుందని తెలిపింది. మరోవైపు, మురుగునీటి ద్వారా సైతం కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు సీసీఎంబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో వినియోగిస్తున్న 1800 మిలియన్ల నీటిలో కేవలం 40 శాతం మాత్రమే మురుగు నీటిని శుభ్రపరిచే కేంద్రాలకు చేరుతున్నాయని వెల్లడించారు. దీని ఆధారంగానే హైదరాబాద్‌ ‌నగరంలో ఎంత మందిపై కొరోనా వైరస్‌ ‌ప్రభావం ఉందనే విషయంపై అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కొరోనా వైరస్‌ ‌బారిన పడ్డ వారిలో లక్షణాలు ఉన్న వారితో పాటు ఏమాత్రం లక్షణాలు కనిపించని వారు, తమకు  తెలియకుండానే కొరోనా సోకి కోలుకున్న వారు కూడా ఉన్నట్లు తేలింది. వ్యర్థాల ద్వారా జరిపిన పరీక్షలు సీఐఎస్‌ఆర్‌ ‌సీసీఎంబీకి చెందిన కోవిడ్‌ 19 ‌పరీక్షా కేంద్రాలలోనే నిర్వహించినట్లు వెల్లడించారు.  కాగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం బుధవారం నాటికి తెలంగాణ అంతటా కలిపినా కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 95,700 మాత్రమే ఉండటం గమనార్హం.

మురుగు నీటిలోనూ కొరోనా వైరస్‌ ఆనవాళ్లు
సిసిఎంబి పరిశోధనల్లో గుర్తింపు
కొరోనా వ్యాప్తిని గుర్తించడం కోసం పరిశోధకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనల్లో రోజురోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొరోనా వైరస్‌ ఒకరి నుంచి మరోకరికి వ్యాపిస్తుందని ఇప్పటి వరకు మనం విన్నాం. కొరోనా బాధితుడు దగ్గినప్పుడు, తమ్మినప్పుడు..తుప్పర్ల ద్వారా కొరోనా రోగికి దగ్గరగా ఉన్నప్పుడు వ్యాధి విస్తరిస్తుంది. లేదా కొరోనా రోగి వాడిన వస్తువు ద్వారా వ్యాపిస్తుందని తెలుసు. అయితే ముక్కు, నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్‌ ‌వ్యాప్తి జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. మురుగునీటిలో కొరోనా వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చి చెప్పింది. మురుగునీటి నమూనాలలో కొరోనా వైరస్‌పై పరిశోధనలు చేశారు. ముక్కు, నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్‌ ఉం‌టుందని, వ్యాధి సోకిన 35 రోజుల వరకు పేషెంట్‌ ‌శరీరంలో వైరస్‌ ఉం‌టుందని సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చిచెప్పింది.

తెలంగాణలో కొత్తగా 1763 కొరోనా కేసులు 8 మంది మృతి
దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు
తెలంగాణలో మంగళవారం రాత్రి 8 గం.లతో ముగిసిన 24 గంటల్లో కొత్తగా 1763 కొరోనా కేసులు నమోదుకాగా.. 8 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో అత్యధికంగా 484 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్లో 169, రంగారెడ్డిలో 166 మందికి పాజిటీవ్‌ ‌వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చికిత్స నుంచి కోలుకుని ఒకేరోజు 1789 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కొరోనా కేసులు 95,700 ఉండగా.. మృతుల సంఖ్య 719కి చేరింది. ప్రస్తుతం 20,990 యాక్టివ్‌ ‌కేసులుండగా, 73,991మంది రికవరీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,97,470 మందికి కొరోనా పరీక్షలు జరిగాయి.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు
ఇండియాలో కొరోనా వైరస్‌ ‌రికవరీ రేటు పెరుగుతున్నది. దేశంలో వైరస్‌ ‌నుంచి కోలుకున్నవారి సంఖ్య 20 లక్షలు దాటింది. గత 24 గంటల్లో అత్యధికంగా 60,091 మంది వైరస్‌ ‌నుంచి రికవర్‌ అయ్యారు.  దీంతో దేశంలో రికవరీ రేటు 73.64 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడిచింది. ఇక గత 24 గంటల్లో దేశంలో 64,531 కొరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. 1092 మంది గత 24 గంటల్లో మరణించారు. దేశవ్యాప్తంగా కొరోనా వైరస్‌ ‌సంక్రమించిన వారి సంఖ్య 27,67,274కు చేరుకున్నది. దీంట్లో 6,76,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 20,37,871 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ఇప్పటి వరకు కొరోనాతో ఇండియాలో 52,889 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply