Take a fresh look at your lifestyle.

కొరోనా నివారణ సిబ్బందికి రక్షణ పరికరాలు, ప్రమాద బీమా వర్తింప చేయాలి.

‌తాండూరు : కొరోనా నివారణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ పరికరాలు, ప్రమాద బీమా వర్తింపు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం దేశ వ్యాప్తంగా సీఐటీయు పిలుపు మేరకు తాండూర్‌ ‌మండలం కేంద్రంలో కొరోనా నివారణలో ముందు వరసలో  పని చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ పరికరాలు, ప్రమాద బీమా సౌకర్యం, 25 వేల వేతనం అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు.

అదే విధంగా కార్మికులకు 12 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు అందరిని ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు దీపక్‌ ‌రెడ్డి, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply