Take a fresh look at your lifestyle.

బీజేపీ పాలనలో.. దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య

మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి
*బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది
*కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత బిఅర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్నడు లేని విధంగా 1లక్ష 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత బిఅర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రవేట్ రంగంలో కూడా దాదాపు 24 లక్షలకు పైగా ఉద్యోగాలు యువతకు కల్పించినట్లు సబితా రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల గూడ లలిత నగర్ చౌరస్తాలో నిర్వహించిన బిఅర్ఎస్ యువ గర్జన సదస్సుకు మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డితో కలిసి చందన చెరువు నుంచి భారీ ర్యాలీగా కాలినడకన చేరుకున్నారు. వేలాది మంది యువతతో చేపట్టిన ర్యాలీలో దారి పొడువునా సబితా ఇంద్రారెడ్డి పై పూల వర్షం కురిపిస్తూ.. జై బిఅర్ఎస్, జై కేసీఆర్, జై సబితమ్మ అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. నినాదాలతో యువ గర్జన రణభేరి సదస్సు హోరెత్తింది.ప్రముఖ గాయకులు వేపురి సోమన్న తన ఆటలు, పాటలతో యువ గర్జనను హోరెత్తించారు. భారీ బైక్, కార్ల ర్యాలీతో స్వచ్చందంగా వేలాదిగా తరలి వచ్చిన యువత, దారిపొడుగునా సబితమ్మ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్న నినాదాలు. సదస్సులో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం యువత పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. విద్యార్థి, యువతను అక్కున చేర్చుకొని చట్టసభలకు పంపిన కేసీఆర్ కే దక్కుతుందన్నారు.యూనివర్సిటిల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు తో పాటు పలు కార్పొరేషన్లు, కమిషన్ లకు, మేయర్లుగా విద్యార్థి, యువకులు వచ్చినట్లు తెలిపారు.ఏ పార్టీ చేయని విధంగా యువత సంక్షేమానికి పెద్ద పీట వేసింది కేసీఆర్ అని అన్నారు.దేశంలో ఏ పార్టీకి లేనంత యువ సైనికుల శక్తి బిఅర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు.బీజేపీ పాలనలో దేశమంతా బేరోజ్ గారు ఉండగా.. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఉపాధి అవకాశాలతో యువత ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 1లక్ష 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి, 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఇచ్చింది మాత్రం జీరో ఉద్యోగాలు అన్నారు.బీజేపీ ప్రభుత్వం దేశంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తుందని మండిపడ్డారు.దేశంలో ఎన్నడు లేని విధంగా బీజేపీ పాలనలో 45 ఏళ్లలో లేనంత నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వములోని వివిద శాఖల్లో 16 లక్షల ఖాలీలు ఉన్న భర్తీ చేయడం లేదన్నారు.రాష్ట్రంలో ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం కృష్జి చేస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పేపర్ లీకు ఘనులు బీజేపీ నాయకులేనన్నారు. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ రద్దు చేయగా, కాంగ్రెస్ వాళ్లు ఫ్యాక్స్ కాన్ ను రద్దు చేస్తామంటున్నారని మండిపడ్డారు. బీజేపీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీలను మన రాష్టానికి రాకుండా చేయడమే కాకుండా, గుజరాత్ కు తలించుకుపోయారన్నారు.దేశమంతా కొత్తగా అనేక విద్య సంస్థలను పెట్టిన, కేంద్రం తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం సహకరించకున్నా, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశమంతా కొత్తగా అనేక నవోదయ పాఠశాలలు ఇచ్చిన, మన రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇవ్వకున్న వందల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసుకొని, రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తునే, ప్రయివేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వేలాది మంది విద్యార్థులకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తూ.. విదేశీ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలు రానున్న కాలంలో యువతకే దక్కుతాయన్నారు. కేసీఆర్ ముందు చూపుతో యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాట్లు చెప్పారు. యువత మనసు తెలిసిన నాయకులు కేసీఆర్, కేటీఆర్ అని, వారు విద్యార్థి, యువత సంక్షేమానికి యెనలేని కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో పాటు సమాజం బాగు కోసం కృషి చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ, కేసీఆర్ కు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహంతో హైదరాబాద్ నగరానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల భారీగా పెట్టుబడులు పడుతున్నాయని, దీంతో తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ పాలనలో కర్ఫ్యూ లేని నగరంగా హైద్రాబాద్, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు లేని రాష్ట్రంగా, మెరుగైన శాంతి భద్రతలు కల్పిస్తున్న ప్రభుత్వం అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీగా తరలివచ్చిన అశేష యువతను చుస్తేనే తెలుస్తుంది మహేశ్వరంలో బిఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏమి లేదని, సబితా ఇంద్రారెడ్డి గెలుపులో ముందుండాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం యువజన సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గములో ఎక్కడా చూసిన గులాబీ జెండాలే రెపరేపలాడుతున్నయన్నారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలించిన కర్ణాటక నేడు దివాలా తీసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గములో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం యువత కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గములో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింనట్లు తెలిపారు.యువ నేత పి.కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన యువతి, యువకులకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గములో యువత బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడటం శుభ పరిణామం అన్నారు. భారీగా తరలివచ్చి యువ గర్జనను విజయవంతం చేసిన యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల వరకు ఇదే జోరు, ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు రాష్ట్రంతో పాటు నియోజకవర్గాలలో స్తానం లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సబితా రెడ్డి, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకోని, అభివృద్ధిని కొనసాగిద్దామన్నారు.అలుపెరుగకుండా పనిచేసే సబితమ్మ వెంటే ఉండి, గెలుపులో యువత కీలక పాత్ర పోషించాలన్నారు.

Leave a Reply