Take a fresh look at your lifestyle.

లాక్ డౌన్ లో పెరుగుతున్న గృహ హింస ..

పాశ్చాత్త్య దేశాలలో గృహ హింస సాధారణ రోజులకంటే ప్రస్తుత కోవిద్‌ 19 ‌పరిస్థితుల్లో మహిళలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.సాధారణ పరిస్థితుల్లోనే మహిళలు నివాస స్థలాన్ని , కుటుంబాన్ని , జీవిత భాగ స్వామీ ని విడిచి బయటికి రావడానికి సంకోచిస్తారు ..లాక్‌ ‌డౌన్‌ ‌రోజుల్లో నయితే గృహ హింసకు గురవుతున్న మహిళల పరిస్థితి దారుణంగా ఉంది . నిబంధనల కారణంగా బయటికి రాలేక పోతున్నారు . బహిరంగంగా ఫిర్యాదు చేయడానికి కూడా సంకోచిస్తున్నారు. గృహ హింసకు గురవుతున్న మహిళలు ఆ దేశాలలో తాము నివాసముంటున్న మెడికల్‌ ‌షాపుల వద్దకు పోయి ‘మాస్క్ 19’ అనడం తో దుకాణదారు ఆమె ఫిర్యాదును పోలీసులకు తెలియజేస్తున్నారు. ‘‘కోవిద్‌ 19 ‌వలన చాలా మంది మహిళలు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. మహిళలు కనీసంగా వారి ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలి. మహమ్మారిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో మహిళల భద్రతకు మొదటి స్థానం కల్పించాలని నేను అన్ని ప్రభుత్వాలను కోరుతున్నాను’’ అని ఖచీ సెక్రటరీ జనరల్‌ ఆం‌టోనియో గుటెర్రెస్‌ ‌ట్విట్‌ ‌చేసారు . కోవిద్‌ 19 ‌వ్యాప్తిని నిలువరించటానికి ప్రపంచాన్ని లాక్డౌన్‌ ‌కింద ఉంచిన నేపథ్యంలో గృహ హింస .. లైంగిక వేదింపులు యెంత ఎక్కువగా పెరిగాయి అంటే ఈ సమస్యని నీడగా కొనసాగుతున్న మరో మహమ్మారిగా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటలీ, చైనా, యుఎస్‌, ‌యుకె, ఫ్రాన్స్, ఆ‌స్ట్రేలియా, భారతదేశంలో ఈ సమస్య తీవ్ర స్థాయిలో వుంది. ఈ సమస్యపై యుఎన్‌ ఏ‌ప్రిల్‌లో మహిళలపై జరుతున్న హింసకి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలకి అప్పీల్‌ ‌చేయాల్సి వచ్చింది. యుఎన్‌ ‌పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌నివేదిక మొత్తం 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలలో గత మూడు నెలల లాక్డౌన్‌ ‌సమయంలో మహిళపై జరుగుతున్నా గృహ హింసలో 20% పెరుగుదల ఉందని చెప్పింది. ప్రతి మూడు నెలల లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగింపుకు మరో 15 మిలియన్‌ ‌కేసులు పెరుగుతాయని యుఎన్‌ ‌పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌భావిస్తున్నది. గృహ హింస బాధితులను గుర్తించడానికి స్పెయిన్‌ ‌ఫ్రాన్స్‌లోని వైద్యులకు మందులు అమ్మే వారికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు, మహిళ ‘మాస్క్ 19’ ‌కోసం అడిగినప్పుడు సదరు మహిళను గమనించామని చెబుతున్నారు. ఇలా చేయటానికి కారణం బాధితులు తమ పరిస్థితి గురించి బహిరంగంగా మాట్లాడలేక కోడ్‌ ‌వర్డ్ ‌గా మాస్క్ 19 అని అంటున్నారు అని తేలింది.

ఇటీవల మనదేశంలో, లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో గృహ హింస కేసులను రిపోర్ట్ ‌చేసేందుకు వాట్సాప్‌ ‌నంబర్‌ 7217735372 ‌ను నేషనల్‌ ‌కమీషన్‌ ‌ఫర్‌ ఉమెన్‌ ‌ప్రకటించాల్సి వచ్చింది. ఎన్‌సిడబ్ల్యు మార్చి నుండి ఆన్‌లైన్‌ ‌వాట్సాప్‌లో మొత్తం 400 ఫిర్యాదులను అందుకుంది. గతేడాది ఆగస్టు నుంచి పరిశీలిస్తే ఇంత స్థాయిలో పిర్యాదులు రావటం ఇదేనని ఎన్‌సిడబ్ల్యు చెబుతున్నది. మనదేశములో 42 శాతం మగవారు భార్యను కొట్టటం తప్పు కాదు అనుకొంటున్న పరిస్థితి వుంది.దేశ వ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ ‌సందర్భంలో 92 వేల ఫిర్యాదులు ఉన్నాయని ఒక స్వచ్చంద సంస్థ ఢిల్లీ హై కోర్టు లో పిటిషన్‌ ‌దాఖలు చేసింది .జాతీయ మహిళా కమిషన్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో పెరుగుతున్న గృహ హింస ఫిర్యాదుల పై ఆందోళన వ్యక్తం చేసింది .పంజాబ్‌ ‌పోలీసులు విడుదల చేసిన డేటా మేరకు పంజాబ్‌ ‌లో 700 గృహ హింస కేసులు నమోదు అయ్యాయి. లాక్‌ ‌డౌన్‌ ‌వలన నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, యాంగ్జైటీ కారణంగా ప్రశాంతత లేని జీవితాలు గడుపుతున్న దంపతులు ఒకరితో ఒకరు సఖ్యతగా మెలగలేక పోతున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌పెరిగే కొలది మహిళపై శారీరిక మానసిక హింస పెరుగుతుంది అని నివేదికలు గోషిస్తున్నాయి.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న నేపథ్యంలో స్త్రీ మద్యం వైపు మళ్లుతున్న దాఖలాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. జీవితంలో ఒత్తిడి.. అనిచ్చితి.. ప్రేమ అనురాగాల లేని వలన మహిళ కూడా మత్తు వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి నేటి సమాజంలో మెండుగా కనిపిస్తున్నది.

Leave a Reply