- ప్రజల సహకారంతో పాలనలో ముందడుగు
- రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్
ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే, ప్రజల సహకారంతోనే పాలనా వ్యవస్థ ప్రగతి పథంలో ముందడుగు వేస్తుందని సీఎం కెసిఆర్ అన్నారు. స్వాతంత్యాన్రంతర భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్‌గా ప్రసిద్ధి పొందిన సురేందర్‌కుమార్‌డే(ఎస్‌కెడే) పంచాయితీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ చేశారని అన్నారు. జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్వహించుకునే స్వయం సహకారం ఉద్యమంలో భాగంగా పంచాయితీరాజ్ వ్యవస్ధ భారత దేశంలో రూపుదిద్దుకున్నదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరగాలనే నాటి ఎస్‌కెడే ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకు వొచ్చిన నూతన పంచాయితీరాజ్‌చట్టం దేశ పంచాయితీరాజ్ వ్యవస్ధకు ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. ఎవరి గ్రామాన్ని వారే తీర్చిదిద్దుకునే విధంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్లలెల్లో పాలనావ్యవస్ధను ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు. పల్లెల అభివృద్ధికిగాను ప్రతి నెలా రూ. 339కోట్లు, పట్టణాల అభివృద్ధికి ప్రతి నెలా 148 కోట్లు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని అన్నారు.
పంరాయితీరాజ్ వ్యవస్ధ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్లలె ప్రగతి, పట్టణ ప్రగతి సహా ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్లలెలు, పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనాన్ని సంతరించుకుని అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. దేశంలో మరే రాష్ట్రం అందుకోలేని విధంగా తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్ధల చేత అనేక జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకుంటున్నదని అన్నారు. రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్ధ బలోపేతం అవుతున్నదనడానికి ఈ అవార్డులు ప్రశంసలు నిదర్శంగా నిలిచాయని సీఎం చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు సంక్షేమం , వ్యవసాయాభివృద్ధితో పాటు గ్రామిణ ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పధకాలు సబ్బండ వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాయన్నారు. తద్వారా నాటి ఎస్‌కెడే కలలు కన్న పంచాయితీరాజ్ సహకార వ్యవస్ధ లక్ష్యాలను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.