‘‘ ‘సోవియట్ యూనియన్ లో సోషలిజం పతనం కావడంతో మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్ అమెరికాలో పలు సోషలిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ’’
మిఖాయిల్ గోర్బచెవ్ నోబెల్ శాంతి బహుమతితో పాటు అనేక పురస్కారాలు పొందారు. ఆయన మొదట్లో నిబద్ధత కలిగిన కరడుగట్టిన మార్క్సిస్ట్-లెనినిస్ట్ గా పేరు గడించి శాస్త్రీయంగాను మార్క్సిజం – లెనినిజానికి కట్టుబడి ఉన్నాడు. అయితే క్రమంగా ఆయన సంస్కరణలు అవశ్యమని భావించి ప్రతిసారి స్టాలిన్ విధానాలను మెరుగుపరుస్తున్నని పేర్కొంటూనే స్టాలినిస్ట్ వ్యతిరేక వైఖరితో ముందుకు సాగాడు. ఆయన క్రమానుగతంగా స్టాలిన్ విధానాలను నిరశించసాగాడు. నికిటా కృచ్చెవ్ అనుసరించిన డీస్టాలినైజేషన్ సంసంస్కరణలను సమర్థించాడు. సంస్కరణలే సోషలిస్ట్ వ్యవస్థని మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దబడతాయని భావించి ఆయన ఆ దిశగా ముందుకు సాగారు.
జె.జె.సి.పి.బాబూరావు, 94933 19690.