Take a fresh look at your lifestyle.

కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్‌ ‌బస్సులు

ఎపి సర్కార్‌ ‌నిర్ణయం : పేర్ని నాని
అమరావతి,మే 27 : కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆక్సిజన్‌ అం‌దించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వెన్నెల స్లీపర్‌, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్‌ ‌బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో కోవిడ్‌ ‌పేషెంట్లకు బస్సుల్లోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్‌ ‌బెడ్లు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఒక్కో ఆర్టీసీ స్లీపర్‌ ‌బస్సులో 10 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ‌బస్సులు ద్వారా సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు.

టెన్త్ ‌పరీక్షలపై హైకోర్టులో విచారణ
పరీక్షలను వాయిదా వేసామని నివేదిక
అమరావతి, మే 27 : పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. దీంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్‌గా గుర్తించలేదంటూ దాఖలైన అఫిడవిట్‌పై విచారణ ముగించాలని ప్రభుత్వ తరపు లాయర్‌ ‌హైకోర్టును కోరారు. అయితే పరీక్షల వాయిదా, స్కూళ్లు తెవబోమని అఫిడవిట్‌ ‌వేయాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను జూన్‌ 18‌కి వాయిదా వేసింది.

Leave a Reply