Take a fresh look at your lifestyle.

లక్ష నుండి 50 వేలకు దిగిన రుణమాఫీ

సుబేదారి (ప్రజాతంత్ర విలేకరి): రాష్ట్రంలో వివిధ బ్యాంకుల్లో ఉన్న లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలను ఏకె ముస్తఫాగా పంట రుణాలను మాఫీ చేస్తానని 2019 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారని వీరందరికీ లక్ష రూపాయల లోపు రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రుణమాఫీ విషయంపై ఎలాంటి ప్రభుత్వ హామీ రాలేదని కాబట్టి రైతులు తమ పంట రుణాలను చెల్లించాలని బ్యాంకు అధికారులు రైతులను ఒత్తిడి చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా రైతులకు వడ్డీ మాఫీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల తీసుకున్న లక్ష రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం రైతుల వడ్డీ మాఫీ లక్ష రూపాయల పంట రుణాలు మాఫీ అని ప్రకటించి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. 2021-22 వార్షిక ఆర్థిక సంవత్సరానికి జూలై, ఆగస్టు నెలల్లో రైతులకు వివిధ బ్యాంకుల ద్వారా వంట రుణాలను మంజూరు చేసే ఆనవాయితీ కొనసాగుతోందన్నారు.

ఇప్పటి వరకు లక్ష రూపాయల మాఫీ విషయం పక్కన పెడితే కనీసం వడ్డీ కూడా రైతులకు చెల్లించలేదన్నారు. రైతులు తమ రుణాలను రీషెడ్యూల్‌ ‌చేసుకోవడానికి వడ్డీ చెల్లిస్తేనే రీషెడ్యూల్‌ ‌చేస్తామని బ్యాంకు అధికారులు అంటున్నారు. ఆగస్టు ఒకటో తారీకు 2021 రోజున రాష్ట్ర క్యాబినెట్‌ ‌తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 50 వేల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ఆరు లక్షల మంది రైతులకు లాభం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. లక్ష రూపాయల రుణమాఫీ ఈ విషయాన్ని మర్చిపోయి రూ.25 వేల పంట రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు గతంలో ప్రకటించిన విషయం తెలిసింది. అయితే 25000 పంట రుణం తీసుకున్న రైతులు చాలా తక్కువ మంది మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ లక్ష రూపాయలకు వడ్డీ కింద ప్రతి సంవత్సరం 6 నుంచి 10 వేల వరకు వడ్డీని చెల్లించవలసిన పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వ రుణాలు తెచ్చుకున్న రైతులకు నిరాశే మిగిలిందని రైతులు అంటున్నారు.

2019లో జరిగిన ఎన్నికల సమయంలో రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చని ప్రభుత్వం కంటితుడుపు చర్యగా 50 వేల వరకు పంట రుణాలు ఉన్న రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం విడ్డూరంగా కనబడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు బ్యాంకులు రైతులకు తక్కువ రుణాలు ఇవ్వడమే కాక వడ్డీని మాత్రం ఎప్పటికప్పుడు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం చెల్లిస్తామన్నారు. కదా అని రైతులు బ్యాంకు అధికారులను అడగగా ప్రభుత్వం తెలిస్తే మీకు మళ్ళీ తిరిగి ఇస్తామని కాబట్టి ముందుగా మోడీ చెల్లిస్తేనే కొత్త అప్పు ఇస్తామని, పంట రుణాలను రీ షెడ్యూల్‌ ‌చేస్తామని బ్యాంకు అధికారులు కోరడంతో చేసేది గత్యంతరం లేక రైతులు తలో చెంబు అమ్ముకొని పంట రుణాలు చెల్లించవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు రెండో తారీఖున కొన్ని పత్రికలలో రెండో విడత పంట రుణాలు మాఫీ అని రాసిన ఈ వార్తలను బట్టి చూస్తే ఆశ్చర్యం కలిగిందని అసలు పంట రుణాలు మాఫీ చేయనప్పుడు రెండో విడత పంట రుణాలు మాఫీ ఎక్కడి నుంచి వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా రైతులను ప్రభుత్వం ఎక్కడికక్కడ మోసం చేస్తుందని అసలే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, కల్తీ ఎరువులు కలిపి పురుగుమందులు, పెట్టుబడి పెరిగిపోయి వ్యవసాయానికి కూలీలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చేది ఇదేనా బహుమతి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ ని ఏక్‌ ‌ముస్తఫాగా మాఫీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రాధేయ పడుతున్నారు. రైతుల ప్రాధేయ పని గమనించి మన్నించి 2021 22 ఆర్థిక సంవత్సరానికి రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త రుణాలను మంజూరు చేయాలని ఇందుకుగాను బ్యాంకు అధికారులకు చేయాలని వడ్డీతో సహా మొత్తం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply