Take a fresh look at your lifestyle.

ఐబి అధికారి అంకిత్‌శర్మ దేహంపై 400 కత్తిపోట్లు !

On the body of IB officer Ankit Sharma 400 stabbing

  • పోస్ట్‌మార్టమ్‌ ‌రిపోర్టు
  • చంపి ముఖంపై యాసిడి పోశారు
  • హత్యలో ‘ఆప్‌’ ‌కౌన్సిలర్‌ ‌తాహిర్‌ ‌హుస్సేన్‌ ‌హస్తం ఉన్నట్లు ఆరోపణ
  • ఆయనను పార్టీ నుండి సస్పెండ్‌ ‌చేసిన ‘ఆప్‌’

ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణ•మంలో ఐబి ఆఫీసర్‌ అం‌కిత్‌ ‌శర్మను విధ్వంసకారులు దారుణంగా హత్య ఏసినట్లు గుర్తించారు. కనీసం 400 సార్లు పదునైన ఆయుధాలతో పొడిచినట్టు శవ పరీక్షలో తేలింది. అంకిత్‌ ‌శర్మ హత్య వెనుక స్థానిక కౌన్సిలర్‌ ‌తాహిర్‌ ‌హుస్సేన్‌ ‌హస్తం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆప్‌ ‌పార్టీ అతడిని సస్పెండ్‌ ‌చేసింది. అంకిత్‌ ‌శర్మను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నిందితులు చాంద్‌ ‌బాఘ్‌ ‌ప్రాంతంలో డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత్‌ ‌శర్మ ఫిబ్రవరి 25న ఇంట్లో సరుకులు కొనడానికి మార్కెట్‌కు వెళ్లాడు. శర్మ తిరిగి రాకపోవడంతో ఆయన తండ్రి రవీందర్‌ ‌కూమార్‌ ‌తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రులు అన్ని వెతికాడు. తన కుమారుడు కనిపించకపోవడంతో ఖజౌరీ ఖాస్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో రవీందర్‌ ‌ఫిర్యాదు చేశాడు. చివరగా శర్మ కల్లు అనే వ్యక్తితో కనిపించినట్టుగా తండ్రి తెలిపాడు. చాంద్‌ ‌బాఘ్‌ ‌ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మృతదేహం ఉన్నట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మృతదేహం నిండా కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం అంకిత్‌ ‌శర్మదిగా గుర్తించారు. పదునైన ఆయుధాలతో పొడవడంతో కడుపులోని పేగులన్ని బయటకు వచ్చాయని, ముఖంపై యాసిడ్‌ ‌పోశారని పోలీసులు వెల్లడించారు. స్థానిక కౌన్సిలర్‌ ‌తాహిర్‌ ‌హుస్సేన్‌ ఆఫీస్‌కు సపంలో అంకిత్‌ ‌శర్మను హత్య చేశారు. తన కుమారుడిని తాహిర్‌ ‌హుస్సేన్‌నే హత్య చేశాడని రవీందర్‌ ‌కుమార్‌ ‌ఖజారి ఖాస్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆప్‌ ‌పార్టీ తాహిర్‌ ‌హుస్సేన్‌ను సస్పెండ్‌ ‌చేసింది. అంకిత్‌ ‌శర్మను రెండు నుంచి నాలుగు గంటల పాటు పదునైన ఆయుధాలతో పొడిచారని ఆరోపిస్తూ బిజెపి నేత సంబిత్‌ ‌పాత్ర ట్వీట్‌ ‌చేశారు. శర్మ పేగులు బయటకు వచ్చేలా పొడిచారని, మృతదేహంపై 400 కత్తిపోట్లు ఉన్నట్టు శవ పరీక్షలో తేలిందని ట్వీట్‌ ‌చేశారు. శర్మ ద్విచక్రవాహనంపై జైశ్రీరామ్‌ అనే వ్యాఖ్య ఉండడంతో అతడిని చంపేశారని మరో బిజెపి లీడర్‌ ‌ట్వీట్‌ ‌చేశాడు. ఢిల్లీలో జరిగిన హింసకాండలో ఇప్పటి వరకు 38 మంది మరణించగా 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐబి ఆఫీసర్‌ అం‌కిత్‌ ‌శర్మ, కానిస్టేబుల్‌ ‌రతన్‌ ‌లాల్‌ ఉన్నాడు.

- Advertisement -

  • తాహిర్‌ ‌హుస్సేన్‌కు బిగుస్తున్న ఉచ్చు
  • ఆధారాలు సేకరించే పనిలో ఫోరెన్సిక్‌ ‌నిపుణులు

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు ఆప్‌ ‌కౌన్సిలర్‌ ‌తాహిర్‌ ‌హుస్సేనే కారణమని ఆధారాలు లభ్యమయ్యాయి. ఢిల్లీ అల్లర్లకు హుస్సేన్‌ ‌నివాసం, ఆయనకు చెందిన ఫ్యాక్టరీ అడ్డాగా మారినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చాంద్‌బాగ్‌లోని హుస్సేన్‌ ‌ఫ్యాక్టరీ వద్ద ఫోరెన్సిక్‌ ‌నిపుణులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 302 సెక్షన్‌ ‌కింద పోలీసులు హుస్సేన్‌ ‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ శాంతి భద్రతల అదనపు కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీ‌వాత్సవ డియాతో మాట్లాడారు. మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌ ‌తాహిర్‌ ‌హుస్సేన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అల్లర్లకు కారకులైన వారికి శిక్ష పడేలా పని చేస్తామని శ్రీవాత్సవ పేర్కొన్నారు. తాహిర్‌ ఇం‌టిపై భారీగా పెట్రోల్‌ ‌బాంబులు, యాసిడ్‌ ‌ప్యాకెట్లు లభ్యమైన విషయం విదితమే. ఇంటెలిజెన్స్ ‌బ్యూరో అధికారి అంకిత్‌ ‌శర్మ హత్యలో తాహిర్‌ ‌పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తన పార్టీ నేతపై ఆరోపణలు రావడంతో సీఎం కేజీవ్రాల్‌ ‌దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తాహిర్‌ను కేజీవ్రాల్‌ ‌తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేశారు. ఇప్పటికే తాహిర్‌పై పోలీసులు మర్డర్‌ ‌కేసునమోదు చేశారు. అతడి ఇంటిని సీల్‌ ‌చేసి.. రెయిడ్స్ ‌చేస్తున్నారు. హింసలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని, ఒకవేళ ఆప్‌ ‌నేతల హస్తం ఉన్నట్లు తేలితే రెండింతల శిక్ష వేయాలని కేజీవ్రాల్‌ అన్నారు. అల్లర్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌ ‌మొహ్మద్‌ ‌తాహిర్‌ ‌హుస్సేన్‌ ‌హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చెబుతారని బిజెపి ప్రశ్నిస్తోంది. పెట్రోల్‌ ‌బాంబులు ఉన్న డబ్బాలు, రాళ్లతో నిండిన బస్తాలు, కొన్ని యాసిడ్‌ ‌ప్యాకెట్లు తాహిర్‌ ‌హుస్సేన్‌ ఇం‌టి పైన ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయ్యాయి. ఆయన ఇంటిపై నుంచి కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడం, పక్కనున్న మరో ఇంటిపై పెట్రోల్‌ ‌బాంబులు విసరడం కనిపించింది.

Leave a Reply