Take a fresh look at your lifestyle.

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు హరీష్‌రావు, గంగుల

సిద్ధిపేట, ఆగస్టు 2 (ప్రజాతంత్ర బ్యూరో): జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివమ్స్ ‌గార్డెన్స్‌లో లయన్స్ ‌క్లబ్‌ ఆఫ్‌ ‌సిద్ధిపేట వారి సౌజన్యంతో మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ ‌హైదరాబాదు ఆధ్వ ర్యంలో ఏర్పాటైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సోమవారం రాష్ట్ర  పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనార్థం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వ హిస్తున్న లయన్స్ ‌క్లబ్‌ ‌ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇతర క్లబ్‌లకు లయన్స్ ‌క్లబ్‌ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Leave a Reply