Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను .. రద్దు చేయాలి

  • విద్యుత్‌ ‌బిల్లు 2020 ఉపసంహరించుకోవాలి
  • 8న చేపట్టే భారత్‌ ‌బంద్‌ ‌ను విజయవంతం చేయాలి
  • ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ ‌వద్ద రైతుల భారీ నిరసన ప్రదర్శన

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కార్పొరేట్‌ ‌చట్టాలను వెంటనే రద్దు చేసి, విద్యుత్‌ ‌సవరణ బిల్లు 2020ను తక్షణమే ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్‌ ‌చేశారు. కనీస మద్దతు ధరలను గ్యారంటీ చేసే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి అమలు చేయడానికి తగిన నిధులను కేటాయించాలని వారు డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఇందిరాపార్క్ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై కొవ్వొత్తులు, ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పాటలు పాడి, కవితలు చదివి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇం‌డియా కిసాన్‌ ‌సంఘం కోఆర్డినేషన్‌ ‌కమిటీ సభ్యుడు కిరణ్‌ ‌విస్సా, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ ‌కన్నె గంటి రవి, అచ్యుత రామారావు, టిపిటిఎఫ్‌ అధ్యక్షుడు అశోక్‌ ‌కుమార్‌, ‌పిడిఎస్‌ ‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరుశురాం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, కొండవీటి సత్యవతి, సిపిఐ రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, సామాజిక కార్యకర్త దేవి, పీవోడబ్ల్యూ సంధ్య, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తదితరులు హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల వలన చిన్న, సన్నకారు రైతులకు రక్షణ లేదు కానీ, కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛ లభించిందన్నారు. దీనిలో ఆ దాని వంటి బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయనీ, భూమి లాంటి సహజ వనరులను కూడా కొల్లగొట్టారని అన్నారు. సన్న, చిన్న కారు రైతులు వ్యవసాయం వదులుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

India Kisan‌sangham Coordination‌ Committee

గత ఆరు నెలలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రైతాంగం సాగించిన ఆందోళనలు, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. మొదట ధరలకు చట్టబద్ధత కల్పించకుండ, వ్యవసాయ కుటుంబాల ఆదాయాలకు హామీ ఇవ్వకుండా కార్పొరేట్లకు మాత్రమే మేలు చేసేలా కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలు దేశాన్ని ప్రజల ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతాయని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టినా కేంద్రం వినిపించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం దేశ రైతాంగానికి దిక్సూచిగా ఉండి పోరాడుతున్న పంజాబ్‌ ‌హర్యానా రైతులను చర్చల పేరుతో పిలిచి కేవలం అధికారులను కూర్చోబెట్టి అవమానించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8న దేశవ్యాప్తంగా చేపట్టే భారత్‌ ‌బంద్‌ ‌కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలు రైతు సంఘాల నాయకులు కొండల్‌, ఆశాలతలతో పాటు దాదాపు 150 మంది రైతులు పాల్గొన్నారు.

Leave a Reply