Take a fresh look at your lifestyle.

మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌

కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు

స్టేషన్‌ ‌ఘనపూర్‌ , ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. శనివారం జరిగిన స్టేషన్‌ ‌ఘనపూర్‌ ‌నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌టికెట్లు ఇచ్చాక పట్టపగలు దొరికిన దొంగ రేవంత్‌ ‌రెడ్డి అని.. యాభై కోట్ల డబ్బులు పెట్టీ పీసీసీ పదవి కొన్నారని కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి చెప్పారు. అది తప్పు అయితే రాహుల్‌ ‌గాంధీ చర్యలు తీసుకోవాలి అని మంత్రి డిమాండ్‌ ‌చేశారు. కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలి. అందరికీ మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఉమ్మడి వరంగల్‌ ‌లో అత్యధిక ఓట్లు రావాలి. 5 కోట్లకు టికెట్‌ అమ్ముకున్నారని అంటున్నారు. ఇలాంటి వాళ్ళ చేతిలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఉంది.. అభ్యర్థులు దొరకడం లేదు. రిజెక్టడ్ ‌వాళ్ళని చేర్చుకుంటారు.. గజ్వేల్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట లలో పోటీ చేస్తారట.. మీ నియోజకవర్గాల్లో పోటీ చేసే దిక్కు మీకు లేదు. 2009 ఎన్నికల్లో చెప్పినవి అమలు చేయలేదు అని విమర్శించారు.

కాంగ్రెస్‌ 2009 ‌మేనిఫెస్టో లో కరెంట్‌, ‌తండాలు గుడెలు, 6 కిలోల బియ్యం అన్నారు.. చావు నోట్లో తల పెట్టీ తెలంగాణ సాధించారు.. చెప్పింది చేశారు, చెప్పనిది కూడా చేశారు. కేసిఆర్‌ ‌భరోసా పేరిట మన మెనిఫెస్టో ఉంది. ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళాలి. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్‌, ‌రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒక్కడు కేసీఆర్‌..ఎకరాకు 10 వేలు ఇచ్చాడు, 16 వేలు పెంచ బోతున్నం.. పింఛన్లు 5 వేలు పెంచబోతున్నాం.. 400 లకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ఇవ్వబోతున్నాము. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు ఇవ్వబోతున్నాము.

రేషన్‌ ‌కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా సీఎం గారు లెక్క చేయడం లేదు. గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నం. ఇకనుండి పెద్దలకు కూడా సన్నబియ్యం. రైతు బీమా లాగానే, 5 లక్షల బీమా కోటి కుటుంబాలకు చెయ్యబోతున్నము. బి ఆర్‌ ఎస్‌ ‌గెలిచాక ఆసరా పింఛన్లు 5వేలు చేయబోతున్నాం. ఆసైండ్‌ ‌ల్యాండ్స్ ‌కి పూర్తి హక్కులు ఇవ్వ బోతున్నం.. ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల చికిత్స ఉచితంగా అందించబోతున్నాం.. స్టేషన్‌ ‌ఘన్‌ ‌పూర్‌ ‌నిండు కుండ లాగా మార్చింది సీఎం కేసీఆర్‌.. ‌మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది కేసీఆర్‌.. ‌కడియం శ్రీహరి మంచి నాయకులు. రాజన్న, శ్రీహరి కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు. మంచి మెజారిటీ తో గెలిపించాలి. జై తెలంగాణ అంటూ ముగించారు

బిఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు లేదు
రేవంత్‌ ‌మాటలను ప్రజల గమనించాలి : మంత్రి హరీశ్‌రావు
ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌28: 55 ఏళ్లు పాలించి తెలంగాణకు ఏమి చేయలేని కాంగ్రెస్‌ ‌పార్టీ బిఆర్‌ఎస్‌ను విమర్శించే స్థాయి లేదని, నాడు కరెంటు ఉంటే వార్త… నేడు తెలంగాణ లో కరెంటు పోతే వార్త అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఉట్నూర్‌లో బీఆర్‌ఎస్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‌పాలిత కర్ణాటకలో కేవలం 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారన్నారు. 3గంటల కరెంటు చాలని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొనడం దుర్మార్గమన్నారు. 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్నారు.

బీజేపీ వాళ్ళు కరెంటుకు టర్లు పెట్టాలని, బిల్లులు వసూలు చేయాలని అంటున్నారని హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌మాత్రం ఒప్పు కోవడం లేదని.. అందుకే రాష్ట్రంపై కేంద్రం అక్కసు పెంచుకుందన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పథకాలను కాంగ్రెస్‌ ‌కాపీ కొట్టిందన్నారు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్‌ అని.. అలాంటి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీదన్నారు. ఖానాపూర్‌లో జాన్సన్‌ను గెలిపించాలని హరీష్‌ ‌రావు కోరారు. జాన్సన్‌ ‌తమ కుటుంబ సభ్యుడని.. అభివృద్ధి పూచీ తమదని అన్నారు. పోడు పట్టాలు రాని రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని హరీష్‌ ‌రావు ప్రశ్నించారు.

Leave a Reply