అంబులెన్సులను ఆపొద్దని పోలీస్‌లకు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. సర్క్యులర్‌లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది. వైద్య సహాయం కోసం ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే పేషంట్లు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. అంబులెన్స్‌లో వస్తున్న పేషంట్ ప్రవేశాన్ని కంట్రోల్ రూం ఆపలేదని హై కోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొంది. అంబులెన్స్‌లు ఆపొద్దని తెలంగాణ పోలీస్‌శాఖకు హైకోర్టు ఆదేశించింది.
పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. ఏపీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. రాష్టాల్రు ఎంట్రీని నిలువరిస్తే ఆర్టికల్ 14 ఉల్లంఘనేనని ఏపీ ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది.