Take a fresh look at your lifestyle.

నేడు లష్కర్‌ ‌బోనాలు

జాతరకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : లష్కర్‌ ‌బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల నేడు బోనాలు, రేపు రంగం నిర్వహించనున్నారు. కొవిడ్‌ ‌తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జాతర జరగనుండడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి తలసాని పర్యవేక్షణలో బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మంత్రి దగ్గరుండి ఏర్పాట్లను పరశీలించారు. శుక్రవారం ఆయన కటుంబ సభ్యులతో కలసి బంగారు బోనం సమర్పించాలరు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ముందస్తు బోనాల్లో భాగంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి ఒడిబియ్యం, సాక సమర్పించారు.

స్టెప్పులేసిన మంత్రి ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి రెండుచోట్ల కొత్త ముఖద్వారాలను ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రూ. 58 లక్షల సొంత నిధులను వెచ్చించారు. ఈ ముఖ ద్వారాల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఇక బోనాల జాతరను పురస్కరించకొని సికింద్రాబాద్‌లో నేడు ఆదివారం తెల్లవారు జామున 4 గంటల నుంచి రేపు సోమవారం రాత్రి జాతర ముగిసే వరకు ట్రాఫిక్‌ ‌మళ్లింపులు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు.

Leave a Reply