Take a fresh look at your lifestyle.

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌

బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రూ.వేల కోట్ల నిధులు తెచ్చి, జల్‌ పల్లిని అభివృద్ధి చేశా…
చేసిన అభివృద్ధిని చూసి వోటు వేయండి
పహాడి షరీఫ్‌ రోడ్డు షోలో సబితా ఇంద్రారెడ్డికి ప్రజల బ్రహ్మరథం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 20: జల్‌ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేసి చూపిస్తానని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత ఐదు ఏళ్ల క్రితం జల్‌ పల్లి మున్సిపాలిటీ పూర్తిగా చెత్త చెదారం, మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తూ.. ఎక్కడ చూసిన మురుగు నీటి గుంతలు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ, మంచి నీరు వంటి మౌలిక సదుపాయాలు లేక ఇక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడేవరన్నారు. కానీ నేడు బిఅర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ నాయకత్వంలో జల్‌ పల్లిలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజలు చేసిన అభివృద్ది, సంక్షేమానికి పట్టం కట్టడం ఖాయమని, జల్‌ పల్లి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జల్‌ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడి షరీఫ్‌ లో నిర్వహించిన ఎన్నికల భారీ రోడ్‌ షోలో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని, ప్రజలకు అభివాదం చేస్తూ.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. రోడ్డు షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల వర్షం కురిపిస్తూ.. సబితా ఇంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు మీరు నాపై చూపిస్తున్న అదర అభిమానాలను ఎప్పటికి మర్చిపోలేనని, ఎప్పటికి కృతజ్ఞతగా ఉంటూ.. ప్రతి ఒక్కరి అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.

జల్‌ పల్లి ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి ప్రత్యేక అభిమానం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చి, అభివృద్ధికి బాటలు వేసినట్లు గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క ఓటరును కలిసి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరించి, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరాలన్నారు. ఈ ప్రాంతంలో ఐటి కంపెనీల రాకతో, పూర్తిగా ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోతాయని, ఐటి కపెనీల కోసం 40 ఎకరాలు ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు.భవిష్యత్తులో ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గములో కళ్యాణ లక్ష్మి 15000, షాది ముబారక్‌ 4000 చెక్కులు అందించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతానికి 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసినట్లు తెలిపారు. పహాడీ షరీఫ్‌ దర్గాకు రూ.14 కోట్లతో ర్యాంప్‌ రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో మైనార్టీల కు అధిక కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో, హైదరాబాద్‌ లో శాంతి భద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయన్నారు. ప్రజలం దరూ అన్నదమ్ముల వలె  ఉంటూ తెలంగాణను అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో నీటి సమస్యతో పాటు దశాబ్దాల పాటు నెలకొన్న అనేక సమస్యలను పరిష్కారించినట్లు తెలిపారు. బిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పి.కార్తీక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత రూపు రేఖలు తెలియని వ్యక్తి కాంగ్రెస్‌ తరుపున పోటీచేస్తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఓటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంలో 3వ స్థానంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply