Take a fresh look at your lifestyle.

అక్షరాస్యతలో ప్రథమ స్థానంలో కేరళ..!

  • ద్వితీయ స్థానంలో ఢిల్లీ, అధమ స్థానంలో ఆంధ్రప్రదేశ్..! 20 వ స్థానంలో తెలంగాణ

న్యూ దిల్లీ: దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కన్నా అట్టడుగు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2017-18లో అక్షరాస్యత రేటు 66.4 శాతం మాత్రమే. తెలంగాణలో 72.8 శాతం తో 20 స్థానంలో నిలిచింది. కర్నాటకలో 77.3 శాతం నమోదు అయింది. కేరళ లో అక్షరాస్యత 96.2 శాతంతో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.జాతీయ గణాంకల శాఖ కార్యాలయం ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరాది కన్నా దక్షిణాదివారిలోనే అక్షరాస్యులు ఎక్కువ మంది ఉంటారన్నది నానుడిచ అయితే, 2017-18 నాటి వివరాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.

అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉన్న బీహార్ కన్నా దిగువ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. బీహార్ లో అక్షరాస్యత రేటు 70.9 శాతం నమోదు అయింది. కాగా, అసోం, ఉత్తరాఖండ్ లు 85.9. 87.6 స్థానాలతో నాల్గవ స్థానాన్ని పంచుకున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. కేరళలో పురుషులు , స్త్రీలలో అక్షరాస్యతలో తేడా బాగా తగ్గింది. గతంలో కన్నా ఈ వ్యత్యాసం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ తేడా 2.2 శాతం మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో 14.4 శాతం ఉంది. మగవారు 84.7 శాతం స్త్రీలు 70.3 శాతం నమోదు అయింది.

స్త్రీ,పురుషుల మధ్య అక్షరాస్యతలో తేడా విషయంలో కేరళ బాగా అట్టడుగున ఉంది. కేరళలో గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు 1.9 శాతం నమోదు అయింది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 23.4 శాతం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ తేడా 19.2 శాతం మాత్రమే. రాజస్థాన్ లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతలో తేడా 38.4 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 91.7 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 53.7 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ, పురుషుల మధ్య అక్షరాస్యత తేడా 13.9 శాతం రాజస్థాన్ లో 23.2 శాతం, ఉత్తరప్రదేశ్ లో 18.4 శాతం తేడా ఉంది. కేరళలో గ్రామీణ మహిళల్లో అక్షరాస్యత 80 శాతం ఉంది. 13రాష్ట్రాల్లో 70 శాతం కన్నా తక్కువ, నాలుగు రాష్ట్రాల్లో 60 శాతం కన్నా తక్కువ నమోదు అయింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!