Take a fresh look at your lifestyle.

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారి జిల్లాలోనే చికిత్సలు

కొరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

నాగర్‌ ‌కర్నూల్‌,‌జూన్‌10.‌ప్రజాతంత్రవిలేకరి:బుధవారం హైదరాబాద్‌ ‌నుండి డీఎంహెచ్‌ ఓ ‌లు, వైద్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ‌లో  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలని,  ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు జిల్లాల్లో  ఆస్పత్రి లో వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు.కిడ్నీ సంబంధిత డైయాలసిస్‌ ‌వ్యాధిగ్రస్తులు, టీబీ దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు అందించవలసిన చికిత్స లను జిల్లాలలోనే చికిత్సలను అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.డయాలసి స్‌ ‌వ్యాధిగ్రస్తులకు జిల్లాల ఆస్పత్రిలోనే డయాలసిస్‌ ‌నిర్వహించాలని ఎట్టి పరిస్థితు ల్లోనూ హైదరాబాద్‌ ‌కు రెఫర్‌ ‌చేయకూడదని సూచించారు. డయాలసిస్‌ ‌యంత్రాలను తప్పనిసరిగా ప్రతిరోజు ఒక వ్యక్తికి డయా లసిస్‌ ‌చేసిన తర్వాత శానిటేషన్‌ ‌చేయాలని ఆదేశించారు. ఆసుపత్రులు పరిశుభ్ర వాతా వరణంలో ఉంచాలని చెత్తాచెదారం లేకుం డా ప్రజలకు ఎల్లవేళలా వైద్యులు  అందుబా టులో వుంచాలని ఆదేశించారు.వైద్య ఆరో గ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి డాక్టరు, సిబ్బం ది ఆరోగ్య పరమైన జాగ్రత్తలు వహించాలని వారి ఆరోగ్యం కొరకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని పి పి ఈ కీట్లు బ్లౌజులు శానిటేషన్‌ ‌సంబంధించిన అన్ని వసతులను కల్పించామని ప్రతి ఒక్క రు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచిం చారు. నగర్‌ ‌కర్నూల్‌ ‌నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌లో డీఎంహెచ్‌ఓ ‌డాక్టర్‌ ‌సుధాకర్‌ ‌లాల్‌, ‌డాక్టర్‌ ‌సాయినాథ్‌ ‌రెడ్డి, ఇతర వైద్యులు పాల్గొన్నారు.

Leave a Reply