Take a fresh look at your lifestyle.

బాలీవుడ్‌ ‌హీరో రిషీ కపూర్‌ ‌మృతి

బుధవారం నటుడు ఇర్ఫాన్‌ ‌ఖాన్‌ ‌మరణించిన విషాదం నుంచి తేరుకోక ముందే గురువారం నటుడు రిషీకపూర్‌ ‌మృతి చెందారు. బుధవారం బాలీవుడ్‌ ‌స్టార్‌ ‌హీరో ఇర్ఫాన్‌ ‌ఖాన్‌ ‌మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. 2018లో రిషీకి క్యాన్సర్‌ ‌బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ ‌రిలయన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన మృతికి సంబంధించిన విషయాన్ని అమితాబ్‌ ‌బచ్చన్‌ ‌తన ట్వీట్‌లో తెలిపారు. ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

1970లలో సెన్సేషనల్‌ ‌హిట్‌ ‌చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్‌ .. ‌లెజెండరీ హీరో, డైరెక్టర్‌ ‌రాజ్‌ ‌కపూర్‌ ‌రెండవ
కుమారుడు. 1970లో మేరా నామ్‌ ‌జోకర్‌ ‌చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన రిషి కపూర్‌ ఈ ‌చిత్రానికి గాను నేషనల్‌ అవార్డ్ అం‌దుకున్నారు. ఇక 1973లో బాబీ అనే చిత్రంలో లీడ్‌ ‌రోల్‌ ‌పోషించిన ఆయన డింపుల్‌ ‌కపాడియా సరసన నటించాడు. ఈ చిత్రానికి ఫిలింఫేర్‌ అవార్డ్ ‌కూడా దక్కింది . 1973-2000 మధ్య 92 సినిమాలు చేశాడు. 41 చిత్రాలలో మల్టీ స్టారర్‌ ‌కథానాయికుడిగా నటించారు ఇటీవల 102 నాటౌట్‌ అనే చిత్రంలో అమితాబ్‌తో కలిసి నటించారు. రిషి కపూర్‌ ఆకస్మిక మరణంతో బాలీవుడ్‌ ‌సినీ పరిశ్రమ దిగ్భ్రాతికి గురైంది. అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. కాగా గురువారమే రిషీకపూర్‌ ‌పార్థీవదేహానికి ముంబైలో అంత్యక్రియలు నిర్వహించారు.

Leave a Reply