Take a fresh look at your lifestyle.

డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి

కోర్టు సముదాయ భవనాన్ని ఒక మాసంలో పూర్తిచేయాలి – నూతన కలెక్టరేట్‌ ‌నిర్మాణ కాంట్రాక్టర్‌పై బ్లాక్‌ ‌లిస్ట్  : ‌కలెక్టర్‌ ‌శ్రీధర్‌.

నాగర్‌ ‌కర్నూల్‌,‌జూన్‌ 10.‌ప్రజాతంత్రవిలేకరి: ఇల్లు లేని పేదలకు పక్క గృహాలు నిర్మించా లనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగు ణంగా జిల్లాలో డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌సంబం ధిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్‌ ‌బుధవారం కలెక్టర్‌ ‌ఛాంబర్‌ ‌లో జిల్లా రెండు పడకలగది, నూతన కలెక్టరేట్‌, ‌కోర్టు ఈవీఎం గోదాం నిర్మాణాల పనులపై జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌, అదనపు కలెక్టర్‌ ‌మను చౌదరి తో  కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 3816 డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌లు మంజూరు కాగా 1235 ఇళ్లకు టెండర్‌ ‌ప్రక్రియ ముగియగా 767 పనులు వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగు తున్న వాటిని మూడు నెలల్లో పూర్తి చేయా లని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. టెండర్‌ ‌ఫైనల్‌ ‌లైన  262 ఇళ్ల పనులు ప్రారంభంకాని వాటిపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా వాటికి టెండర్‌ ‌ప్రక్రియ పూర్తి చేయాలని, నివాస యోగ్యమైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్‌ ‌సముదాయ భవన్‌, ‌కోర్టు, ఈవీఎం గోదాం  నిర్మాణాలపై సమీక్షించారు.

నూతన కలెక్టరేట్‌ ‌సముదాయ భవనం నిర్మాణ ప్రగతిపై కలెక్టర్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.భవనం ఏమాత్రం పురోగతి లో లేదని ఇప్పటివరకు బేస్మెంట్‌ ‌లెవెల్‌ ‌మాత్రమే పూర్తి చేశారని,అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత కాంట్రాక్టర్‌ ‌ను బ్లాక్‌ ‌లిస్టులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభు త్వానికి నివేదించాలని అదనపు కలెక్టర్‌ ‌కు కలెక్టర్‌ ‌మను చౌదరికి సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కోర్టు సముదాయ భవ నాన్ని ఒక మాసంలో పూర్తి చేయాలని ఆదేశించారు.ఈవీఎంలను భద్రపరిచేందుకు భవన నిర్మాణా పురోగతి ఎందుకు వేగవం తంగా సాగడం లేదని సంబంధిత ఆర్‌ అం‌డ్‌ ‌బి ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ‌ప్రశ్నిం చారు. వాటి నిర్మాణ పనులు పురోగతి సా ధించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశిం చారు. ప్రతి శనివారం డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌ప్రభుత్వ భవనాల ప్రగతి నిర్మాణం పై సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌వెల్లడిం చారు.ఈ సమావేశంలో ఈఈ పి ఆర్‌ ‌దామో దర్‌ ‌రావు, డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌నోడల్‌ అధికా రి శ్రీ రాములు, ఆర్‌ అం‌డ్‌ ‌బి డిఈ రమాదేవి, ఆర్‌ అం‌డ్‌ ‌బి ఏఈ కిరణ్‌, ‌సిబ్బంది యాదయ్య పాల్గొన్నారు.

Leave a Reply